Jabardasth Actor Sandeep: ప్రేమ పేరుతో మోసం.. బాధితురాలిని పలుమార్లు వశపరుచుకున్న ‘జబర్దస్త్’ నటుడు సందీప్‌.. పెళ్లి ఊసెత్తకపోవడంతో యువతి ఫిర్యాదు.. కేసు

ఈటీవీలో వచ్చే కామెడీ షో ‘జబర్దస్ట్’ ద్వారా గుర్తింపు సంపాదించుకున్న నటుడు, గాయకుడు నవ సందీప్‌ పై హైదరాబాద్ మధురానగర్‌లోని పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ప్రేమ పేరుతో నమ్మించి మోసం చేశాడంటూ ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేశారు.

Nava Sandeep (Credits: X)

Hyderabad, Aug 21: ఈటీవీలో (ETV) వచ్చే కామెడీ షో ‘జబర్దస్ట్’ (Jabardasth) ద్వారా గుర్తింపు సంపాదించుకున్న నటుడు, గాయకుడు నవ సందీప్‌ (Actor Sandeep) పై హైదరాబాద్ (Hyderabad) మధురానగర్‌లోని పోలీస్ స్టేషన్‌లో (Police Station) కేసు నమోదైంది.  ప్రేమ పేరుతో నమ్మించి మోసం చేశాడంటూ ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. పోలీసుల కథనం ప్రకారం.. నవ సందీప్‌ కు 2018లో ఓ యువతితో పరిచయం అయింది. అది మరింత ముదిరింది. విషయం తెలియడంతో యువతి తల్లిదండ్రులు ఆమెను దూరం పెట్టారు. సందీప్ భరోసాతో ఇంటి నుంచి వచ్చిన యువతి షేక్‌ పేటలోని ఆల్‌ హమారా కాలనీలోని ఓ హాస్టల్‌లో ఉంటోంది.

వశపరుచుకొని.. ముఖం చాటేసి

ఈ క్రమంలో ఆమెను పలుమార్లు వశపరుచుకున్నసందీప్ పెళ్లి విషయాన్ని మాత్రం దాటవేస్తూ వస్తున్నాడు. దీంతో మనస్తాపం చెందిన యువతి తొలుత గోల్కొండ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అది తమ పరిధి కాకపోవడంతో అక్కడి పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి మధురానగర్‌ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. మధురానగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్‌ పై విచారణ 12కి వాయిదా

Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్

Pranay 'Honour Killing' Case: ఆరేళ తర్వాత ప్రణయ్ హత్య కేసులో కీలక తీర్పు, ఒకరికి ఉరి, ఆరుగురికి జీవితఖైదు విధించిన నల్గొండ కోర్టు, 2018లో జరిగిన మిర్యాలగూడ పరువు హత్య కేసు వివరాలు ఇవే..

Viveka Murder Case: జగన్‌ కుట్రల పట్ల అప్రమత్తంగా ఉండాలని పదే పదే చెప్పా, వాచ్‌మెన్ రంగన్న మృతిపై అనుమానాలున్నాయంటూ చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

Advertisement
Advertisement
Share Now
Advertisement