Getup Srinu and Sudigali Sudheer and Auto Ram Prasad (Photo-Video Grab)

జబర్దస్త్ షోలో ఈ మధ్య కాలంలో పలు మార్పులు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఇప్పటికే ఈ షో నుంచి కొంత మంది ఇక్కడ మానేసి వేరొక షోలోకి జంప్ అవ్వడం జరిగింది. గతంలో టీమ్స్ తో కలకలలాడే జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ ఇప్పుడు కొద్ది మంది తోనే స్కిట్ లు చేస్తూ నడుపుతోంది. ఇదంతా ఇలా ఉండగా ఎక్స్ట్రా జబర్దస్త్ లో(Extra Jabardasth) సక్సెస్ఫుల్ టీం అయిన సుడిగాలి సుదీర్ టీమ్ లో కూడా కొద్దిపాటి మార్పులు జరిగినట్లుగా తెలుస్తోంది.

లేటెస్ట్ గా ఎక్స్ ట్రా జబర్దస్త్ టీం ప్రోగ్రాం లో సుధీర్ టీం నుండి కేవలం ఆటో రాంప్రసాద్ ఒక్కడే పాల్గొనడం జరిగింది. ఇతర టీం లో ఉండే వారిని రాంప్రసాద్ తీసుకొని స్కిట్ (Auto Ram Prasad Skit) చేయడం జరిగింది. అయితే తాజాగా విడుదలైన ప్రోమో లో సక్సెస్ఫుల్ డైరెక్టర్ గా పేరు పొందిన అనిల్ రావిపూడి గెస్ట్ గా రావడం జరిగింది. ఇక డైరెక్టర్ కి సుధీర్ టీమ్ అంటే చాలా ఇష్టం అన్న అనిల్ రావిపూడి కి సుధీర్ శ్రీను లేకుండా ఒక్కడివే స్కిట్ చేయడం ఎలా ఉందని ఆటో రాంప్రసాద్ అని అడగగా.. అందుకు ఆటో రాంప్రసాద్ మాట్లాడుతూ ఆటో ఇంజన్ లేకుండా వచ్చిందని వాళ్ళిద్దరి గురించి ప్రస్తావించారు. మరి సుధీర్, శ్రీను లు (Getup Srinu and Sudigali Sudheer) నెక్స్ట్ వీక్ ఎండ్ ఎపిసోడ్ కి ముందుకు రాలేకపోయాతో ఏమో కాని ఆ ఎఫెక్ట్ మాత్రం ఈ షో మీద బాగా కనిపిస్తోందని చెప్పవచ్చు.

జబర్దస్త్‌‌లోకి మళ్లీ హైపర్ ఆది రీ ఎంట్రీ.., శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమోలో కనిపించిన కమెడియన్, అసలు విషయం ఏంటీ అనేది ఇంకా సస్పెన్స్

దీంతో అభిమానులు కూడా కాస్త ఆందోళన చెందుతున్నారు. సుదీర్, శీను ఎక్స్ట్రా జబర్దస్త్ షో ని మానేశారా అన్నట్లుగా మాట్లాడుకుంటున్నారు. అయితే గెటప్ శీను కు మాత్రం వరుస సినిమాలలో అవకాశాలు రావడంతో తను కొద్ది రోజులు జబర్దస్త్ కు గుడ్ బై చెప్పాడు అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక సుధీర్ కూడా ప్రస్తుతం సినిమాలలో నటిస్తున్నాడు.. కనుక బిజీగా ఉండడం వల్ల జబర్దస్త్ లో నటించ లేదు.. అన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. లేదంటే ఇతర షో లో నటించే అవకాశం రావడంతో అక్కడికి వెళ్ళారేమో తెలియాలి.



సంబంధిత వార్తలు

Jabardasth Show: జ‌బ‌ర్ద‌స్త్ కామెడీ షో ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్, ఇక‌పై ఆ షో ఉండ‌దు, క‌న్నీళ్లు పెట్టుకున్న కంటెస్టెంట్స్, ర‌ష్మీ

Sudigali Sudheer on Marriage: పెళ్లి మీద ఇంట్రస్ట్ లేదంటూ సుడిగాలి సుధీర్ షాకింగ్ కామెంట్స్, రష్మితో పెళ్లి గురించి జబర్దస్త్ నటుడి సమాధానం ఇదిగో..

Nandamuri Balakrishna: మనదంతా ఓపెన్, నేను విగ్గు పెట్టుకుంటే నీకెందుకురా వెదవ! బాలకృష్ణ సంచలన కామెంట్స్, భగవంత్ కేసరి ప్రెస్‌మీట్‌లో రెచ్చిపోయిన నటసింహం

Unstoppable With NBK Season 3: శరవేగంగా పూర్తయిన అన్‌ స్టాపబుల్ సీజన్ 3 ఫస్ట్ ఎపిసోడ్‌, సొంత సినిమా ప్రమోషన్‌తో సీజన్ మొదలు పెట్టిన బాలయ్య, రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన ఆహా

Bhagavanth Kesari Trailer: పక్కా తెలంగాణ యాసలో బాలకృష్ణ మాస్ డైలాగ్స్, కేక పుట్టిస్తున్న భగవంత్ కేసరి ట్రైలర్, హన్మకొండలో అట్టహాసంగా వేడుక

Sudigali Sudheer: యాంకర్ రష్మీకి షాక్ ఇచ్చి, పెళ్లి చేసుకోబుతున్న సుడిగాలి సుధీర్, అమ్మాయి ఎవరో తెలుసా..?

Balakrishna 108th Film Title: బాలయ్య 108 మూవీ టైటిల్ ఖరారు, బర్త్‌ డే కు రెండు రోజుల ముందే ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్‌, భగవంత్ కేసరిగా ముందుకొస్తున్న నటసింహం

Sudigali Sudheer: ఎట్టకేలకు పెళ్లి చేసుకోబోతున్న సుడిగాలి సుధీర్? వరుసకు మరదలు అయ్యే అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడంటూ తాజాగా ప్రచారం