గతంలో టాలీవుడ్ డ్రగ్స్ కేసు కేసులో నిందితుడిగా ఉన్న నిర్మాత కేపీ చౌదరి (కృష్ణప్రసాద్ చౌదరి) ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆయన గోవాలో బలవన్మరణం చెందినట్టు గుర్తించారు. 2023లో డ్రగ్స్ విక్రయిస్తుండగా కేపీ చౌదరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో కేపీ చౌదరి ప్రస్తుతం బెయిల్ పై బయట ఉన్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కబాలి చిత్ర తెలుగు వెర్షన్ నిర్మాతల్లో కేపీ చౌదరి ఒకరు. కాగా, కేపీ చౌదరి మృతిపై (KP Chowdary Dies by Suicide) ఆయన తల్లికి పోలీసులు సమాచారం అందించారు. కేపీ చౌదరి తల్లి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఉంటున్నారు.
టాలీవుడ్ లో విషాదం.. ఈ ఉదయం కన్నుమూసిన నిర్మాత వేదరాజు టింబర్
కేపీ చౌదరి పూర్తి పేరు కృష్ణప్రసాద్ చౌదరి. 2016లో సినీ రంగంలోకి ప్రవేశించాడు. పలు తెలుగు, తమిళ సినిమాలకు డిస్ట్రిబ్యూటర్‌గా పనిచేశారు. సర్దార్ గబ్బర్ సింగ్, అర్జున్ సురవరం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి పలు సినిమాలకు డిస్ట్రిబ్యూటర్‌గా పనిచేశారు. అయితే నిర్మాతగా మారిన తర్వాత కేపీ చౌదరికి కలిసి రాకపోవడంతో గోవాలో ఓమ్ పబ్‌ను స్టార్ట్ చేశాడు. అక్కడ కూడా లాస్ రావడంతో తనకు ఉన్న పరిచయాలతో సెలబ్రెటీలకు డ్రగ్స్ విక్రయాలు చేయడం మొదలుపెట్టారని అప్పట్లో వార్తలు వచ్చాయి.హైదరాబాద్‌లోని వరలక్ష్మీ టిఫిన్స్ డ్రగ్స్ కేసులోనూ కేపీ చౌదరి నిందితుడిగా ఉన్నారు.