Jabardasth Appa Rao: నన్ను వయసు పేరుతో ఘోరంగా అవమానించారు, అందుకే జబర్దస్త్ నుంచి తప్పుకున్నాను, సంచలన విషయాలు వెల్లడించిన కమెడియన్ అప్పారావు

ఆ షోలో సీనియర్‌ని అయినప్పటికీ నాకు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదు. అలా నన్ను పరోక్షంగా అవమానించారు. అందుకే తప్పుకోవాల్సి (why He left Comedy Show ) వచ్చింది. వెళ్లేటప్పుడు కూడా కనీసం ఎందుకు వెళ్తున్నారని ఒక్క మాట కూడా అడగలేదు.

jabardasth-apparao (Photo-Video Grab)

జబర్దస్త్' కామెడీ షోతో పాపులర్‌ అయిన కమెడియన్లలో అప్పారావు (Jabardasth Appa Rao) ఒకరు. అయితే ఈ మధ్య కొంతకాలంగా ఆయన ఆ షోలో కనిపించడం లేదు. దీనిపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. 'ఆ షోలో 7-8 సంవత్సరాలుగా ఉన్నాను. షూటింగులకు ఒక్కరోజు కూడా డుమ్మా కొట్టకుండా వెళ్లేవాడిని. కానీ కరోనా సెకండ్‌ వేవ్‌ తర్వాత నా వయసును దృష్టిలో పెట్టుకొని ‍ మేనేజ్‌మెంట్‌ కొంతకాలం వెయిట్‌ చేయమన్నారు.

కానీ ఆ తర్వాత వాళ్లు నన్ను పిలవలేదు. చెప్పుడు మాటలు విని నా పేరును హోల్డ్ లో పెట్టారు. స్కిట్స్‌లో అంతగా ప్రాధాన్యత లేని పాత్రలు కూడా చేశాను. ఒకప్పుడు టీమ్‌ లీడర్‌గా చేసిన నేను ఆ తర్వాత కాలంలో ఒక కంటెస్టెంట్‌కు ఇచ్చిన గుర్తింపు కూడా నాకు వారు ఇవ్వలేదు. ఆ షోలో సీనియర్‌ని అయినప్పటికీ నాకు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదు. అలా నన్ను పరోక్షంగా అవమానించారు. అందుకే తప్పుకోవాల్సి (why He left Comedy Show ) వచ్చింది. వెళ్లేటప్పుడు కూడా కనీసం ఎందుకు వెళ్తున్నారని ఒక్క మాట కూడా అడగలేదు. ఏదైతేనేం, ఇప్పుడు మరో కామెడీ షో చేస్తున్నాను. డబుల్‌ పేమెంట్‌ ఇస్తున్నారు. ఇప్పుడు నా పరిస్థితి బాగుంది అని ఆ ఇంటర్యూలో చెప్పుకొచ్చారు.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Pranay 'Honour Killing' Case: ఆరేళ తర్వాత ప్రణయ్ హత్య కేసులో కీలక తీర్పు, ఒకరికి ఉరి, ఆరుగురికి జీవితఖైదు విధించిన నల్గొండ కోర్టు, 2018లో జరిగిన మిర్యాలగూడ పరువు హత్య కేసు వివరాలు ఇవే..

SLBC Tunnel Collapse Update: ఎస్‌ఎల్‌బీసీ రెస్క్యూ ఆపరేషన్‌ రెండ్రోజుల్లో పూర్తి చేస్తాం, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన, రాజకీయం చేయడానికి హరీశ్‌రావు వచ్చారని మండిపాటు

'Torture' Allegations on Rajamouli: రాజమౌళి కోసం నేను పెళ్ళి కూడా చేసుకోలేదు, దారుణంగా వాడుకుని వదిలేశాడు, జక్కన్నపై స్నేహితుడు ఉప్పలపాటి శ్రీనివాసరావు సంచలన ఆరోపణల వీడియో ఇదిగో..

KTR Supports Stalin's Stand on Delimitation: డీలిమిటేషన్‌పై తమిళనాడు సీఎం స్టాలిన్‌కు మద్దతు తెలిపిన కేటీఆర్, నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణ భారతదేశానికి అన్యాయం జరుగుతుందని వెల్లడి

Advertisement
Advertisement
Share Now
Advertisement