KTR Slams Congress Govt Over Harassing Farmers(X)

Hyd, Feb 26: డీలిమిటేషన్‌పై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌ చేసిన వ్యాఖ్యలను బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సమర్థించారు. నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణ భారత దేశానికి అన్యాయం జరుగుతుందన్న వ్యాఖ్యలకు మద్దతిచ్చారు. దేశానికి అత్యవసరమైనప్పుడు కుటుంబ్ర నియంత్రణను సమర్థవంతంగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలను శిక్షించడం తగదని అన్నారు.

దేశాభివృద్ధిలో దక్షిణాది రాష్ట్రాల పాత్రను పరిగణనలోకి తీసుకోకుండా నియోజకవర్గాల పునర్విభజన చేయడం ప్రజాస్వామ్య, సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని కేటీఆర్‌ అన్నారు. కేంద్ర ప్రభుత్వం నిజంగానే నియోజకవర్గాల పునర్విభన చేయాలని భావిస్తే.. అది దేశానికి అందించే ఆర్థిక సహకారం వాటా ఆధారంగా ఉండాలని ప్రతిపాదించారు.

సీఎం స్టాలిన్ ప్రభుత్వంలో అందరూ అవినీతిపరులే, ఈ సారి తమిళనాడులో వచ్చేది ఎన్టీఏ ప్రభుత్వమే, డీఎంకే సర్కారుపై నిప్పులు చెరిగిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా

జనాభా ప్రాతిపాదికన నియోజకవర్గాలను పునర్విభజించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం తెలంగాణతో సహా ఇతర దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళలకు శాపంగా పరిణమిస్తుందని ఆయన హెచ్చరించారు. ఈ విషయంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సామాజిక మాధ్యమాల్లో వ్యక్తం చేసిన ఆందోళనలతో తాను పూర్తిగా ఏకీభవిస్తున్నానని (KTR Supports Stalin's Stand on Delimitation) కేటీఆర్ తెలిపారు.

KTR Supports Stalin's Stand on Delimitation

దక్షిణాది రాష్ట్రాలు దేశ నిర్మాణంలో అందించిన సహకారాన్ని ఎవరూ కాదనలేరని ఆయన అన్నారు. కాబట్టి నియోజకవర్గాల పునర్విభజనలో ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలి” అని కేటీఆర్ సూచించారు.