Peddireddy Ramachandra Reddy: 25ఏళ్లుగా మేము భూమిని సాగు చేస్తున్నాం, అటవీ భూమి అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు, వారిపై పరువు నష్టం దావా వేస్తానని తెలిపిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎల్లో మీడియాపై మండిపడ్డారు. 2001లో భూములు కొనుగోలు చేస్తే ఇప్పుడు ఎల్లో మీడియా ఫేక్‌ వార్తలు రాస్తోందని మండిపడ్డారు. ఈ క్రమంలో తప్పుడు వార్తలు రాసిన ఈనాడు(Eenadu), ఈటీవీపై పరువు నష్టం దావా వేస్తానని చెప్పారు.

Peddireddy Ramachandra Reddy (photo-YSRCP/X)

Vjy, Jan 29: మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎల్లో మీడియాపై మండిపడ్డారు. 2001లో భూములు కొనుగోలు చేస్తే ఇప్పుడు ఎల్లో మీడియా ఫేక్‌ వార్తలు రాస్తోందని మండిపడ్డారు. ఈ క్రమంలో తప్పుడు వార్తలు రాసిన ఈనాడు(Eenadu), ఈటీవీపై పరువు నష్టం దావా వేస్తానని చెప్పారు. ఆయన (Peddireddy Ramachandra Reddy) మాట్లాడుతూ.. మాకు సంబంధించిన భూములపై ఎల్లో మీడియా(Yellow Media) తప్పుడు కథనాలు రాస్తోంది. 2001లోనే మేము భూములు కొనుగోలు చేశాం. మాజీ సీఎం కిరణ్‌ కుమార్‌ రెడ్డి హయాంలోనే రెవెన్యూ అధికారులు భూమి సర్వే చేశారు.

25ఏళ్లుగా మేము భూమిని సాగు చేస్తున్నాం. ఇప్పుడు అది అటవీ భూమి అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వం విచారణ జరిపి అటవీ భూములు లేవని తేల్చింది. అంతకంటే ముందు కిరణ్‌ కుమార్‌ ప్రభుత్వం కూడా విచారణ చేపట్టింది. అప్పుడు కూడా అటవీ భూములు కాదని తేల్చారు. 2001 నుంచి భూములను సాగు చేస్తున్నాం. ఈనాడు, ఈటీవీ తప్పుడు కథనాలపై పరువు నష్టం దావా వేస్తాను.

ఫిర్యాదు కోసం పోలీస్ స్టేషన్‌కి వెళితే గుడ్డలిప్పి పోలీసులు దారుణంగా కొట్టారు, అడిగినందుకు జర్నలిస్ట్‌లను రైలు పట్టాలపై పడుకోబెడతామంటారా అంటూ అనంత వెంకటరామిరెడ్డి మండిపాటు

గతంలో కూడా అదే పత్రిక మదనపల్లి ఘటనలో తప్పుడు వార్తలు రాశారు. అప్పుడు వారిపై రూ.50కోట్లకి పరువు నష్టం దావా వేశాం. ఈరోజు అటవీ భూములు ఆక్రమించామని మళ్ళీ వార్త రాశారు. కేవలం 23 ఎకరాల భూమి 75 ఎకరాలు ఎలా అయ్యింది అని వార్తలు రాశారు. 19.11.1981లో డైరెక్టర్ ఆఫ్ సెటిల్‌మెంట్ మాకు అమ్మిని వారికి ఆర్డర్ ఇచ్చారు. అధునాతన గెస్ట్ హౌస్ కట్టాలని వార్తలు రాశారు. 2001 లోనే అక్కడ పని చేసే వారి కోసం మేము గెస్ట్ హౌస్ కట్టాం. కోర్టులో పిటిషన్ వేసినా కూడా కోర్టు ఆ పిటిషన్‌ను తోసిపుచ్చింది. 1968లో ఇచ్చిన ఫారెస్ట్ గెజిట్‌లో కూడా ఆ 76 ఎకరాలు వారికి సంబంధం లేదు అని తేల్చారు. దారి కూడా ఇవ్వాలని రైట్ ఆఫ్ వే కూడా కల్పించారు.

27.06.2022 లో బ్లాక్ టాప్ రోడ్డు వేసేందుకు కేంద్రం నుండి అనుమతులు కూడా వచ్చాయి. చంద్రబాబు తానా అంటే పవన్ కళ్యాణ్ తందాన అంటున్నారు. గతంలో ఇసుక ద్వారా 40 వేల కోట్లు మింగేసాను అని, ఆ తర్వాత నేపాల్‌లో నాకు సంబంధించిన ఎర్ర చందనం దొరికింది అని ఆరోపించారు. మరి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యి ఉండి ఇన్ని రోజులు అయినా ఎందుకు చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు.

బాబు డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తున్నారు. చంద్రబాబు(Chandrababu) కుట్రలు, కుతంత్రాలు అందరికీ తెలుసు.ఎన్నికల సందర్బంగా చెప్పిన ప్రకారం.. చంద్రబాబు సూపర్‌ సిక్స్‌ హామీలను నెరవేర్చాలి. రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారు. చంద్రబాబుకు త్వరలోనే ప్రజలు బుద్ధి చెబుతారు. ఏపీలో వైఎస్సార్‌సీపీ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయం. ఎవరు పార్టీలో ఉన్నా, లేకున్నా వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తుంది. వైఎస్‌ జగన్ నాయకత్వంలో మళ్ళీ అధికారం ఖాయం. క్యాలెండర్ ఇచ్చి పథకాలు అమలు చేసిన ఘనత వైఎస్ జగన్‌ది. కరోనాతో ప్రపంచమంతా అల్లకోల్లోలం అయినా కూడా ఎక్కడా పథకాలు ఆపలేదు అంటూ వ్యాఖ్యలు చేశారు.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి

Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్‌ పై విచారణ 12కి వాయిదా

CM Revanth Reddy: ఆత్మగౌరవంలోనే కాదు.. త్యాగంలోనూ పద్మశాలీలు ముందుంటారు, సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు, ఆసిఫాబాద్ మెడికల్ కాలేజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెడుతున్నట్లు ప్రకటన

Kalyan Ram New Movie Title: మరోసారి పోలీస్ డ్రస్‌ వేసిన విజయశాంతి, హిట్‌ మూవీ వైజయంతి రోల్‌లో కల్యాణ్‌రామ్‌కు తల్లిగా వస్తున్న కొత్త సినిమా పోస్టర్ ఇదుగోండి!

Advertisement
Advertisement
Share Now
Advertisement