Drishyam Horror: ‘దృశ్యం’ సినిమాను తలపించేలా మరో హత్య .. బావమరిదిని చంపి ఇంట్లో పాతిపెట్టి నున్నగా ఫ్లోరింగ్ చేసిన బావ.. విషయం ఎలా బయటపడిందంటే??

కేరళలో నిజమైన ‘దృశ్యం’ సినిమా ఆవిష్కృతమైంది. ఓ వ్యక్తిని హత్య చేసిన నిందితుడు పోలీసుల నుంచి తప్పించుకునేందుకు అతడి మృతదేహాన్ని ఇంట్లోనే పాతిపెట్టి చక్కగా ఫ్లోరింగ్ చేసేశాడు. కేరళలో ఈ ఘటన జరిగింది..

Kerala Murder (Photo Credits: Twitter)

Tiruvanantapuram, October 3: కేరళలో నిజమైన ‘దృశ్యం’ (Drishyam) సినిమా ఆవిష్కృతమైంది. ఓ వ్యక్తిని హత్య చేసిన నిందితుడు (Accused) పోలీసుల నుంచి తప్పించుకునేందుకు అతడి మృతదేహాన్ని ఇంట్లోనే పాతిపెట్టి చక్కగా ఫ్లోరింగ్ (Flooring) చేసేశాడు. పోలీసుల కథనం ప్రకారం.. కొట్టాయం జిల్లాకు చెందిన బిందు కుమార్ (40)  వారం రోజుల క్రితం అలప్పుళలో అదృశ్యమయ్యాడు. అతడి కోసం గాలించినా ఫలితం లేకపోడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు (Police) ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అతడి ఫోన్ కాల్స్‌ ను (Phone Calls) పరిశీలించారు.  బిందు కుమార్ చివరిసారిగా కొట్టాయం జిల్లా చంగనేస్సరికి చెందిన ముత్తుకుమార్‌తో ఫోన్‌లో మాట్లాడినట్టు గుర్తించారు. దీంతో అతడిని వెతక్కుంటూ చంగనేస్సరిలోని ఆయన ఇంటికి వెళ్లారు. ఇంట్లో అతడు లేకపోవడంతో చుట్టుపక్కల వారిని పోలీసులు ఆరా తీశారు. ఆయన ఇంట్లో కొన్ని రోజులుగా మరమ్మతులు జరుగుతున్నాయని ఇరుగుపొరుగు వారు చెప్పడంతో అనుమానించి ఇంట్లోకి వెళ్లి చూశారు. ఇంట్లోని గచ్చు కొత్తగా ఉండడంతో దానిని బద్దలు కొట్టించి తవ్వించారు. అరగంటపాటు తవ్విన తర్వాత వారికి ఓ గోనె సంచి కనిపించింది.

మేఘాల్లో.. 3 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న విమానం మీదకు సర్రున దూసుకొచ్చిన బుల్లెట్.. సరాసరి ఓ ప్రయాణికుడి చెంపలోకి.... తర్వాత ఏమైంది??

 దానిని వెలికి తీసి చూసిన పోలీసులు షాక్‌కు గురయ్యారు. ఆ గోనె సంచిలో బిందు కుమార్ మృతదేహం ఉంది. వెంటనే ఆ మృతదేహాన్ని పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు. ముత్తుకుమార్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.  ముత్తుకుమార్.. బిందుకుమార్‌ చెల్లెల్లి భర్త కావడం గమనార్హం. కాగా, పోలీసులు తొలుత బిందుకుమార్ మోటార్ సైకిల్‌ని కొట్టాయంలోని వకతానమ్ గ్రామంలో గుర్తించారు. దీంతో ఆయన రోడ్డు ప్రమాదంలో మరణించి ఉంటాడని భావించారు. అయితే, ఆ గ్రామంలో తమ అల్లుడు ఉంటాడని బాధితుడి తల్లి చెప్పడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ హత్య వెనక గల కారణం ఏంటన్నది తెలియరాలేదని, దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement