TS SSC Results 2024: తెలంగాణ 10వ తరగతి పరీక్షా ఫలితాలు రేపు విడుదల, Results.bsetelangana.org ద్వారా మీ ఫలితాలను చెక్ చేసుకోండి

తెలంగాణలో పదవ తరగతి పరీక్షా ఫలితాలు రేపు విడుదల కాబోతున్నాయి. ఇందుకోసం విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రేపు ఉదయం 11 గంటలకు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఫలితాలను విడుదల చేయనున్నారు.

Exams Results

తెలంగాణలో పదవ తరగతి పరీక్షా ఫలితాలు రేపు విడుదల కాబోతున్నాయి. ఇందుకోసం విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రేపు ఉదయం 11 గంటలకు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఫలితాలను విడుదల చేయనున్నారు. ఫలితాలు ఆన్ లైన్ లో విడుదల కాబోతున్నాయి. పదో తరగతి పరీక్షా ఫలితాలకు విడుదల చేసేందుకు ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సీబీఎస్‌ఈ బోర్డు పరీక్షలు ఇకపై ఏటా రెండు సార్లు.. కేంద్ర విద్యాశాఖ కసరత్తు.. వచ్చే విద్యాసంవత్సరం నుంచే అమలుకు యత్నం

మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు పదో తరగతి పరీక్షలు జరిగాయి. దాదాపు 5.08 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. వీరిలో 2,50,433 మంది బాలికలు... 2,57,952 మంది బాలురు పరీక్షలకు హాజరయ్యారు. జవాబు పత్రాల మూల్యాంకనం ప్రక్రియ ఏప్రిల్ 13 నాటికి పూర్తయింది. పదో తరగతి పరీక్షల ఫలితాలను బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అధికారిక వెబ్ సైట్ https://results.bsetelangana.org లో చెక్ చేసుకోవచ్చు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement