TSPSC Group 1 Mains Exam Date:  జూన్ 5 నుంచి 12 వరకు గ్రూప్‌-1 మెయిన్స్ పరీక్షలు, తెలంగాణ Group 1 Mains Exam Dates షెడ్యూల్ విడుదల చేసిన టీఎస్పీఎసీ

తెలంగాణ గ్రూప్‌-1 మెయిన్స్ పరీక్షల తేదీలు ఖరారయ్యాయి. జూన్ 5 నుంచి 12 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1:00 వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. అభ్యర్థులు ఇంగ్లిష్, తెలుగు, ఉర్దూ భాషల్లో వారి చాయిస్ మేరకు పరీక్షలు రాయవచ్చు.

Exams Representational Image. |(Photo Credits: PTI)

తెలంగాణ గ్రూప్‌-1 మెయిన్స్ పరీక్షల తేదీలు ఖరారయ్యాయి. జూన్ 5 నుంచి 12 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1:00 వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. అభ్యర్థులు ఇంగ్లిష్, తెలుగు, ఉర్దూ భాషల్లో వారి చాయిస్ మేరకు పరీక్షలు రాయవచ్చు.

జనరల్‌ ఇంగ్లిష్‌ పేపర్‌ మినహా మిగతా అన్ని పేపర్‌లకు అభ్యర్థులు తాము ఎంచుకున్న భాషలో పరీక్ష రాసుకోవచ్చని పేర్కొంది. కాగా, గత ఏడాది అక్టోబర్ 16న గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,86,051 మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు.

తెలంగాణలో భారీగా ఐఏఎస్‌లు బదిలీలు, 15 మంది ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి

అయితే, గ్రూప్‌-1 ద్వారా మొత్తం 503 పోస్టులను భర్తీ చేయనున్న టీఎస్‌పీఎస్‌సీ ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున మెయిన్స్‌కు తీసుకుంది. అంటే ప్రిలిమ్స్‌కు హాజరైన వారి నుంచి 25,150 మంది అభ్యర్థులను మెయిన్స్‌ పరీక్షకు ఎంపిక చేసింది.

కాగా, టీఎస్‌పీఎస్‌సీ షెడ్యూల్‌ ప్రకారం.. జూన్‌ 5న జనరల్‌ ఇంగ్లిష్‌ (అర్హత పరీక్ష), జూన్‌ 6న జనరల్‌ ఎస్సే (పేపర్‌-1), జూన్‌ 7న హిస్టరీ, కల్చర్‌ అండ్‌ జాగ్రఫీ (పేపర్‌-2), జూన్‌ 8న ఇండియన్‌ సొసైటీ, కాన్‌స్టిట్యూషన్‌ అండ్‌ గవర్నెన్స్‌ (పేపర్‌-3), జూన్‌ 9న ఎకానమీ అండ్‌ డెవలప్‌మెట్‌ (పేపర్‌-4), జూన్‌ 10న సైన్స్‌ & టెక్నాలజీ అండ్‌ డాటా ఇంటర్‌ప్రిటేషన్‌ (పేపర్‌-5), జూన్‌ 12న తెలంగాణ ఉద్యమం అండ్‌ రాష్ట్ర ఆవిర్భావం (పేపర్‌-6) అంశాలపై పరీక్షలు జరగనున్నాయి.

షెడ్యూల్ ఇదే..

జూన్‌-5: జనరల్ ఇంగ్లిష్(అర్హత పరీక్ష)

జూన్-6: పేపర్-I - జనరల్ ఎస్సే

జూన్‌-7: పేపర్‌-II - హిస్టరీ, కల్చర్, జాగ్రఫీ

జూన్‌-8: పేపర్‌-III - ఇండియన్ సొసైటీ, కానిస్టిట్యూషన్, గవర్నెన్స్

జూన్‌-9: పేపర్-IV - ఎకానమీ అండ్ డెవలప్‌మెంట్,

జూన్-10: పేపర్-V - సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ డేటా ఇంటర్‌ప్రెటేషన్

జూన్‌-12: పేపర్-VI - తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర అవతరణ

ప్రతి పరీక్షకు మూడు గంటల సమయం. 150 మార్కులు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement