TS Inter Result 2022 Declared: తెలంగాణ ఇంటర్ ఫలితాలు వచ్చేశాయి, tsbie.cgg.gov.in లింక్ ద్వారా మీ ఫలితాలను చెక్ చేసుకోండి

తెలంగాణ ఇంటర్మీడియట్‌ ఫలితాలు విడుదల అయ్యాయి. రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఉదయం 11 గంటలకు ఈ ఫలితాలను (TS Inter Result 2022) ప్రకటించారు. రాష్ట్రంలో ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షలు మే 6 నుంచి 24 వరకు నిర్వహించిన విషయం తెలిసిందే.

Representational Image | File Photo

తెలంగాణ ఇంటర్మీడియట్‌ ఫలితాలు విడుదల అయ్యాయి. రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఉదయం 11 గంటలకు ఈ ఫలితాలను (TS Inter Result 2022) ప్రకటించారు. రాష్ట్రంలో ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షలు మే 6 నుంచి 24 వరకు నిర్వహించిన విషయం తెలిసిందే. సుమారు 9 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాశారు. ఇందులో ఫస్టియర్ పరీక్షలకు 4,64,626 మంది హాజరు కాగా, సెకండియర్ పరీక్షలు 4,42,768 మంది రాశారు. మొత్తం 1,443 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసి 25 వేల మంది ఇన్విజిలేటర్లు, 150 మంది సిట్టింగ్ స్క్వాడ్, 75 మంది ఫ్లయింగ్ స్క్వాడ్‌లతో పరీక్షలు పటిష్టంగా నిర్వహించారు. ఈ ఫలితాలను https://tsbie.cgg.gov.in, https://results.cgg.gov.in, https:// examresults.ts.nic.in వెబ్‌సైట్లలో చూడవచ్చని అధికారులు తెలిపారు.

పదో తరగతి విద్యార్థులకు తెలుగు సబ్జెక్ట్ తప్పనిసరి చేసిన తెలంగాణ ప్రభుత్వం, జీవో 15ను అమలు చేయాలని అన్ని జిల్లాల విద్యా శాఖ అధికారులకు ఆదేశాలు

కరోనా నేపథ్యంలో గత ఏడాది ఇంటర్ ఫస్టియర్ పరీక్షా ఫలితాల్లో 49 శాతం మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. పరిస్థితులను అర్థం చేసుకున్న ఇంటర్ బోర్డ్, రాష్ట్ర విద్యాశాఖ చివరకు కనీస మార్కులతో అందరినీ పాస్ చేశారు. ఇలాంటి పరిస్థితి మరోసారి రాకూడదని అధికారులు జాగ్రత్తలు తీసుకుని ఈ ఏడాది పరీక్షలు నిర్వహించారు. ఫలితాలు విడుదలయ్యాక కేవలం 15 రోజుల్లోనే అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించాలని భావిస్తున్నారు. తద్వారా ఇంజనీరింగ్, ఎంబీబీఎస్, ఇతర కోర్సుల్లో ప్రవేశాలకు విద్యార్థులకు ఇబ్బంది తలెత్తకూడదని ఈ నిర్ణయం తీసుకున్నారు.

బోర్డ్ వెబ్ సైట్లో ఇంటర్ ఫలితాలను ఇలా చెక్ చేసుకోవచ్చు.

Step 1: ఫలితాల విడుదల అనంతరం అభ్యర్థులు మొదటగా ఇంటర్ బోర్డు అధికారిక వెబ్ సైట్ https://tsbie.cgg.gov.in ను ఓపెన్ చేయాలి.

Step 2: అనంతరం హోం పేజీలో ఇంటర్ రిజల్ట్స్ కు సంబంధించిన లింక్ కనిపిస్తుంది. ఆ లింక్ పై క్లిక్ చేయాలి.

Step 3: కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ హాల్ టికెట్ నంబర్ నమోదు చేసి విద్యార్థులు తమ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement