COVID19: కరోనావైరస్ పాజిటివ్ కేసుల్లో చైనాను వెనక్కి నెట్టిన భారత్, దేశవ్యాప్తంగా 85,940కు పెరిగిన కోవిడ్-19 బాధితులు, వైరస్ తీవ్రత అత్యధికంగా ఉన్న ప్రపంచ దేశాలలో 11వ స్థానానికి ఎగబాకిన ఇండియా
262,843 పాజిటివ్ కేసులతో రష్యా 2వ స్థానంలో, ఆ తరువాత స్థానాలలో వరుసగా యునైటెడ్ కింగ్డమ్ (238,004), స్పెయిన్ (230,183)....
New Delhi, May 16: 'ఇతర దేశాలతో పోలిస్తే' అని పోల్చుకోవడం, ఘనతలు చాటుకోవడం ఇకపై చెల్లవు. ఎందుకంటే దేశంలో కరోనావైరస్ కేసులు క్రమంగా పెరగుతూ వచ్చి, ఈరోజు వైరస్ పుట్టుక కారణం అని చెప్పబడే చైనా దేశాన్ని సైతం భారత్ అధిగమించింది. కోవిడ్-19 తో తీవ్రంగా ప్రభావితమైన ప్రపంచ దేశాలలో భారత్ 11వ స్థానానికి చేరుకుంది.
గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా మరో 3,970 పాజిటివ్ కేసులు మరియు 103 మరణాలు నమోదయ్యాయి. దీంతో భారతదేశంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య ఇప్పుడు 85,940 దాటింది. దీని ప్రకారం గ్లోబల్ రికార్డుల్లో చైనా యొక్క కోవిడ్-19 సంఖ్య 84,038 ను అధిగమించిందని జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం తెలిపింది.
భారత్ లో తక్కువ మొత్తంలో వైరస్ నిర్ధారణ పరీక్షలు చేస్తారనే విమర్శలు ఉండగా, 50 రోజుల లాక్డౌన్ అనంతరం కూడా అధికారిక గణాంకాల ప్రకారం కరోనా కేసులు 86 వేలకు చేరువవడం కొంత ఆందోళన కలిగించే విషయం. అయినప్పటికీ ఈ వైరస్ బారిన పడి కోలుకునే వారు ఎక్కువ సంఖ్యలో ఉండటం, మరణాల సంఖ్య తక్కువగా ఉండటం కొంత ఉపశమనం కలిగించే విషయం.
దేశంలో నమోదైన మొత్తం కేసుల్లో 30,153 బాధితులు కోలుకోని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అవగా, ఇప్పటివరకు 2,752 మంది కరోనా, మరియు ఇతర అనారోగ్య కారణాలు కలిగి ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో 53,035 ఆక్టివ్ కేసులు ఉన్నాయని భారత వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఇండియాలో రాష్ట్రాల వారీగా కోవిడ్-19 కేసుల వివరాలు ఇలా ఉన్నాయి:
S. No. | Name of State / UT | Total Confirmed cases* | Cured/Discharged/Migrated | Deaths** |
---|---|---|---|---|
1 | Andaman and Nicobar Islands | 33 | 33 | 0 |
2 | Andhra Pradesh | 2307 | 1252 | 48 |
3 | Arunachal Pradesh | 1 | 1 | 0 |
4 | Assam | 90 | 41 | 2 |
5 | Bihar | 1018 | 438 | 7 |
6 | Chandigarh | 191 | 37 | 3 |
7 | Chhattisgarh | 66 | 56 | 0 |
8 | Dadar Nagar Haveli | 1 | 0 | 0 |
9 | Delhi | 8895 | 3518 | 123 |
10 | Goa | 15 | 7 | 0 |
11 | Gujarat | 9931 | 4035 | 606 |
12 | Haryana | 818 | 439 | 11 |
13 | Himachal Pradesh | 76 | 39 | 3 |
14 | Jammu and Kashmir | 1013 | 513 | 11 |
15 | Jharkhand | 203 | 87 | 3 |
16 | Karnataka | 1056 | 480 | 36 |
17 | Kerala | 576 | 492 | 4 |
18 | Ladakh | 43 | 22 | 0 |
19 | Madhya Pradesh | 4595 | 2283 | 239 |
20 | Maharashtra | 29100 | 6564 | 1068 |
21 | Manipur | 3 | 2 | 0 |
22 | Meghalaya | 13 | 11 | 1 |
23 | Mizoram | 1 | 1 | 0 |
24 | Odisha | 672 | 166 | 3 |
25 | Puducherry | 13 | 9 | 1 |
26 | Punjab | 1935 | 305 | 32 |
27 | Rajasthan | 4727 | 2677 | 125 |
28 | Tamil Nadu | 10108 | 2599 | 71 |
29 | Telangana | 1454 | 959 | 34 |
30 | Tripura | 156 | 42 | 0 |
31 | Uttarakhand | 82 | 51 | 1 |
32 | Uttar Pradesh | 4057 | 2165 | 95 |
33 | West Bengal | 2461 | 829 | 225 |
Cases being reassigned to states | 230 | |||
Total number of confirmed cases in India | 85940# | 30153 | 2752 |
ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు, మూడు లక్షలకు పైగా కోవిడ్-19 ద్వారా మరణించారు మరియు 45 లక్షలకు పైగా వ్యక్తులకు కరోనావైరస్ సోకినట్లు ఆయా దేశాలు ప్రకటించిన అధికారిక గణాంకాల ప్రకారం తెలుస్తుంది. ఇండియాకు వంద కోట్ల డాలర్ల సాయం ప్రకటించిన ప్రపంచ బ్యాంకు
ప్రపంచంలో కోవిడ్-19 చేత అత్యధికంగా ప్రభావితమైన దేశంలో భారత్ ఇప్పుడు 11వ స్థానంలో ఉంది. ఈ జాబితాలో యునైటెడ్ స్టేట్స్ 1,442,819 కేసులు మరియు 87,530 మరణాలతో మొదటి స్థానంలో ఉంది. 262,843 పాజిటివ్ కేసులతో రష్యా 2వ స్థానంలో, ఆ తరువాత స్థానాలలో వరుసగా యునైటెడ్ కింగ్డమ్ (238,004), స్పెయిన్ (230,183), ఇటలీ (223,885), బ్రెజిల్ (218,223), ఫ్రాన్స్ (179,630), జర్మనీ (175,233), టర్కీ (146,457) మరియు ఇరాన్ (116,635) దేశాలు ఉన్నాయి.