Arrest Warrant On Robin Uthappa: రాబిన్ ఉతప్పకు షాక్, ఈపీఎఫ్ చెల్లింపు కేసులో అరెస్ట్ వారెంట్ జారీ, రూ.24 లక్షల డబ్బు జమ చేయాల్సిందేనని వెల్లడి
టీమిండియా మాజీ ఆటగాడు రాబిన్ ఉతప్పకు షాక్ తగిలింది. ఉద్యోగులను మోసం చేసిన ఈపీఎఫ్ కేసులో అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. రాబిన్ ఉతప్ప సెంచరీస్ లైఫ్ స్టైల్ బ్రాండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ప్రైవేట్ కంపెనీని నడుపుతున్నాడు. ద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ విరాళాలకు సంబంధించి మోసం చేశారనే ఆరోపణల నేపథ్యంలో అరెస్ట్ వారెంట్ జారీ చేశారు అధికారులు.
Delhi, December 21: టీమిండియా మాజీ ఆటగాడు రాబిన్ ఉతప్పకు షాక్ తగిలింది. ఉద్యోగులను మోసం చేసిన ఈపీఎఫ్ కేసులో అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. రాబిన్ ఉతప్ప సెంచరీస్ లైఫ్ స్టైల్ బ్రాండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ప్రైవేట్ కంపెనీని నడుపుతున్నాడు. ద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ విరాళాలకు సంబంధించి మోసం చేశారనే ఆరోపణల నేపథ్యంలో అరెస్ట్ వారెంట్ జారీ చేశారు అధికారులు.
రూ. 23,36,602 నష్టపరిహారాన్ని చెల్లించడంలో ఉతప్ప విఫలమయ్యారని డిసెంబర్ 4న జారీ చేసిన అరెస్ట్ వారెంట్‌లో ప్రాంతీయ పిఎఫ్ కమిషనర్ సదాక్షరి గోపాల్ రెడ్డి తెలిపారు. బకాయిలు చెల్లించకపోవడంతో ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలను పరిష్కరించలేకపోతున్నామని ఆయన్న అరెస్ట్ చేసి వారెంట్ ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు. రాజస్థాన్ యువతి బౌలింగ్‌కు సచిన్ ఫిదా, లేడి జహీర్ అంటూ కితాబు... సచిన్ ట్వీట్ కు స్పందించిన జహీర్ ఖాన్
ఉతప్ప భారతదేశం తరపున 59 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడారు. ధోని సారథ్యంలో టీమిండియా టీ20 వరల్డ్ గెలవగా అందులో ఉతప్ప సభ్యుడు. నోటీసు జారీ చేసేందుకు పోలీసులు రాబిన్ ఉతప్ప ఇంటికి వెళ్లారు. కానీ, ప్రస్తుతం ఆ నివాసం ఉండడంలేదు. దీంతో రాబిన్ ఉతప్పపై అరెస్ట్ వారెంట్ అమలులోకి వచ్చింది.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)