Infosys Jobs: ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? ఇన్ఫోసిస్ లో ఫ్రెషర్స్ కోసం ఈ ఏడాది 55వేల ఉద్యోగాలు, ఎవరెవరు అర్హులో చూడండి!

ఐటీ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న ఫ్రెషర్స్ కు ఇన్ఫోసిస్ గుడ్ న్యూస్ చెప్పింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో క్యాంపస్‌ల నుంచి 55వేలకు పైగా ఫ్రెషర్స్‌కు ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్లు ఆ కంపెనీ సీఈవో సలీల్‌ పరేఖ్‌ తెలిపారు. టెక్‌ రంగంలో ఇంజినీరింగ్‌, సైన్స్‌ విద్యార్థులకు మంచి అవకాశాలు ఉన్నాయని, దాన్ని అందిపుచ్చుకోవడానికి నిత్యం కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలని వారికి సూచించారు.

Image used for representational purpose. (Photo Credits: PTI)

New Delhi, Feb 16: ఐటీ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న ఫ్రెషర్స్ కు ఇన్ఫోసిస్ (Infosys) గుడ్ న్యూస్ చెప్పింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో క్యాంపస్‌ల నుంచి 55వేలకు పైగా ఫ్రెషర్స్‌కు (freshers) ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్లు ఆ కంపెనీ సీఈవో సలీల్‌ పరేఖ్‌ (Salil Parekh)తెలిపారు. టెక్‌ రంగంలో ఇంజినీరింగ్‌, సైన్స్‌ విద్యార్థులకు మంచి అవకాశాలు ఉన్నాయని, దాన్ని అందిపుచ్చుకోవడానికి నిత్యం కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలని వారికి సూచించారు. నాస్కామ్‌ (NASSCOM) ఆధ్వర్యంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 55 వేల మంది కాలేజీ గ్రాడ్యుయేట్లను నియమించుకోబోతున్నామని, వచ్చే ఆర్థిక సంవత్సరం అంతకంటే ఎక్కువ మందిని నియమించుకోబోతున్నట్లు సలీల్‌ పరేఖ్‌ (Salil Parekh) తెలిపారు.

Amazon India Jobs: నిరుద్యోగులకు శుభవార్త, అమెజాన్‌లో 50 వేల ఉద్యోగాలు, స్వతంత్ర కాంట్రాక్టర్లు,పార్ట్‌టైమ్ ఉద్యోగాలకు ప్రకటన విడుదల చేసిన అమెజాన్ ఇండియా

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ వార్షిక ఆదాయంలో 20 శాతం మేర వృద్ధి ఉండే అవకాశం ఉందని చెప్పారు. కంపెనీలో చేరి, ఎదిగేందుకు ఫ్రెషర్స్‌కు ఇదో సదావకాశమన్నారు. నైపుణ్యం కలిగిన మానవ వనరులపై కంపెనీ దృష్టి పెట్టిందన్న సలీల్ పరేఖ్.. ఫ్రెషర్స్ కు ఉద్యోగం కల్పించే ముందు ఆరు నుంచి 12 నెలల శిక్షణ ఇస్తున్నామని చెప్పారు.

Telangana Govt Jobs: ఉద్యోగ ఖాళీల వివరాలపై అస్పష్టత, ఐదు రోజుల్లో పూర్తి వివరాలు అందజేయాలని అధికారులకు తెలంగాణ కేబినేట్ ఆదేశం, జిల్లాల వారీగా సంఖ్య చూపించాలని సూచన

ప్రస్తుతం ఉన్న ఉద్యోగులకు కూడా నైపుణ్య శిక్షణ అందిస్తున్నామని చెప్పారు. అయితే, టెక్‌ ప్రపంచంలోకి అడుగుపెట్టబోయే కొత్తవారు ఎప్పటికప్పుడు కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలని సూచించారు. టెక్నాలజీ రంగం ఎప్పటికప్పుడు వేగంగా మార్పులకు లోనవుతోందని చెప్పారు. అందుకే 3-5 ఏళ్లకోసారి కొత్త స్కిల్స్‌ నేర్చుకోవాల్సి ఉంటుందని పరేఖ్‌ తెలిపారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement