Amazon Fab Phones Fest 2020 Sale Kicks Off With Offers : (Photo Credits: BussinessSuiteOnline.com)

New Delhi, May 22: కోవిడ్‌-19 సంక్షోభం, లాక్‌డౌన్‌ COVID-19 Lockdown) ఆంక్షల్లో చిక్కుకుని దిగ్గజాలనుంచి స్టార్టప్‌ కంపెనీల దాకా అందరూ ఉద్యోగులను తొలగించుకుంటూ పోతున్న విషయం విదితమే. అలాగే వేతనా కోత కూడా విధిస్తున్నారు. ఈ నేపథ్యంలో అమెజాన్ నిరుద్యోగులకు శుభవార్తను చెప్పింది. తమకు 50 వేల సిబ్బంది అవసరం (Amazon India Jobs) పడుతుందని అమెజాన్ ఇండియా (Amazon India) శుక్రవారం ప్రకటించింది. పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా 50వేల మందిని నియమించుకోనున్నామని తెలిపింది. ఏపీలో రీస్టార్ట్ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఏపీ సీఎం వైయస్ జగన్, ఎంఎస్‌ఎంఈలకు రెండు విడతలుగా రూ.1110 కోట్ల మేర సాయం, ఏపీలో 2514కు చేరుకున్న కరోనా కేసులు

అమెజాన్‌ ఫ్లెక్స్‌లో స్వతంత్ర కాంట్రాక్టర్లుగా, పార్ట్‌టైమ్ ఉద్యోగాల (seasonal jobs) కింది వీరిని తీసుకుంటామని తెలిపింది. భారతదేశం అంతటా అమెజాన్‌ కేంద్రాలు, డెలివరీ నెట్‌వర్క్‌లో ఈ అవకాశాలుంటాయని ప్రకటించింది. ఈ మహమ్మారి సమయంలో వీలైనంత ఎక్కువ మందికి సురక్షితమైన పని వాతావరణాన్ని కల్పిస్తామని అమెజాన్ కస్టమర్ ఫిల్లిమెంట్ ఆపరేషన్స్, వైస్‌ ప్రెసిడెంట్‌ అఖిల్ సక్సేనా ఒక ప్రకటనలో తెలిపారు.

Here's Amit Agarwal Tweet

ఇదిలా ఉంటే ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ఫుడ్ డెలివరీ సేవల రంగంలోకి కూడా అడుగు పెట్టింది. మొదట బెంగళూరులో తన కార్యకలాపాలను ప్రారంభించనుంది. స్థానిక రెస్టారెంట్లు, క్లౌడ్ కిచెన్ల నుండి ఆహారాన్ని ఆర్డర్ చేయడానికి వినియోగదారులను అనుమతిస్తున్నామని అమెజాన్ ఒక ప్రకటనలో తెలిపింది. వినియోగదారుల కోరిక మేరకు వారికి షాపింగ్ అనుభవంతో పాటు, భోజన ఆనందాన్ని కూడా ఇవ్వాలనుకుంటున్నామని అమెజాన్ ప్రతినిధి ఒకరు తెలిపారు. ప్రస్తుతం బెంగుళూరుకు పరిమితమైన తమ సేవలు క్రమంగా అన్ని నగరాలకు విస్తరిస్తామన్నారు.

కాగా కరోనావైరస్ మహమ్మారి ప్రభావంతో స్విగ్గీ తన ఉద్యోగులలో 1100 మందిని తొలగించడంతోపాటు, క్లౌడ్ కిచెన్స్ వ్యాపారం నుంచి తప్పుకోవాలని చూస్తున్నట్టు సోమవారం ప్రకటించిన సంగతి తెలిసిందే