File (Credits: Twitter)

San Francisco, April 5: ప్రపంచవ్యాప్తంగా ఆర్ధికమాంధ్యం కారణంగా ఉద్యోగాలు ఊడుతున్నాయి. ఇప్పటికే పలు టెక్ కంపెనీలు భారీగా ఉద్యోగులను తొలగించగా, తాజాగా ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ (Amazon Layoffs) మరోసారి ఉద్యోగుల్లో కోత పెట్టింది. గేమింగ్ విభాగంలో దాదాపు 100 మంది ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించింది. ప్రైమ్ గేమింగ్, గేమ్ గ్రోత్, అమెజాన్ గేమ్స్ (Gaming Verticals) విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులను తొలగిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు అమెజాన్ కంపెనీ అంతర్గతంగా మెమో విడుదల చేసింది. ఇప్పటికే మార్చిలో 9వేల మంది ఉద్యోగులను తొలగిస్తూ కంపెనీ ప్రకటన చేసింది.

తాజాగా మరోసారి లే ఆఫ్స్ ప్రకటించడంతో ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. జనవరి నుంచి ఇప్పటి వరకు దాదాపు 18వేల ఉద్యోగాలకు కోత విధించింది. అయితే ఖర్చులను తగ్గించుకోవడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ ప్రతినిధులు చెప్తున్నారు.