Amaravati, May 22: సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల(MSME)ల బలోపేతం కోసం రీస్టార్ట్ (AP Restart Program)పేరిట ఓ కార్యక్రమాన్ని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. దీనిలో భాగంగా రెండు విడతలుగా రూ.1110 కోట్ల మేర సాయాన్ని ప్రకటించి ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈలకు ప్రభుత్వం నుంచి చేయూతను అందించనున్నారు. శుక్రవారం తాడేపల్లి క్యాంప్ ఆఫీస్‌లో చిన్న,మధ్య తరగతి పరిశ్రమల ప్రతినిధులతో సీఎం వైఎస్ జగన్ (AP CM YS jagan) వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి పాల్గొన్నారు. వైజాగ్ వాసులను పరుగులు పెట్టించిన హెచ్‌పీసీఎల్ పొగ, ప్రమాదం లేదని తెలియడంతో ఊపిరి పీల్చుకున్న వైజాగ్ వాసులు
రాష్ట్రంలోని సుక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల నిర్వాహకులకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమల రంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అందులో భాగంగా గత ప్రభుత్వహయాంలోని బకాయిలను కూడా చెల్లిస్తున్నామని, లాక్‌డౌన్ నేపథ్యంలో పరిశ్రమలు మూతపడి నష్టాల్లో ఉండటంతో విద్యుత్ ఛార్జీలు మూడు నెలల పాటు మాఫీ చేస్తున్నట్లు సీఎం వెల్లడించారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమలతోనే స్థానికంగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. అంఫాన్ సైక్లోన్ కల్లోలం, 83 రోజుల తర్వాత మమతా ఇలాకాలో అడుగుపెట్టిన ప్రధాని మోదీ, స్వాగతం పలికిన వెస్ట్ బెంగాల్ సీఎం, అంఫాన్ ప్రభావంపై ఒడిషా, పశ్చిమ బెంగాల్ సీఎంలతో సమీక్ష సమావేశాలు
పరిశ్రమలకు ఎలాంటి నైపుణ్యం గల కార్మికులు అవసరమో గుర్తించాలని కలెక్టర్లను సీఎం ఆదేశించారు. గత ప్రభుత్వం ఎగ్గొట్టిన రూ.827 కోట్లతో పాటు మొత్తం రూ.905 కోట్ల ప్రోత్సాహకం ఏపీ ప్రభుత్వం అందించనుంది. అంతేకాకుండా రూ.187 కోట్ల స్థిర విద్యుత్ చార్జీల మాఫీ, నిర్వహణ మూల ధనం రుణాలకు రూ.200 కోట్లతో ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఎంఎస్‌ఎంఈలకు కేవలం 6 నుంచి 8 శాతం వడ్డీకే రుణాలు ఇస్తామన్నారు. ప్రభుత్వ కొనుగోళ్లలో 25 శాతం ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈల నుంచే చేయాలని నిర్ణయించారు. అలా చేసిన కొనుగోళ్లకు 45 రోజుల్లో చెల్లింపులు చేయాలని సీఎం వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారు.
ఏపీలో శుక్రవారం కొత్తగా 62 మందికి కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఏపీ వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 2514కు చేరింది. గడిచిన 24 గంటల్లో 8,415 మంది సాంపిల్స్ పరీక్షించగా 62 మందికి కోవిడ్-19 పాజిటివ్‌గా నిర్థారణయింది. కాగా శుక్రవారం కొత్తగా 51 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 1731కి చేరింది. కరోనాతో ఇవాళ కృష్ణా నుంచి ఒకరు మరణించడంతో మృతుల సంఖ్య 55కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 728 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.