Thick Smoke from HPCL (Photo-Twitter)

Visakhapatnam, May 22: వైజాగ్ ఎల్జీ పాలిమర్స్ (LG Polymers plant) ఘటన మరువకు ముందే మరొక ఘటన వైజాగ్ (Visakhapatnam) వాసులను ఉక్కిరి బిక్కిరి చేసింది. అయితే అది అంత పెద్ద ప్రమాదం కాకపోవడంతో ప్రజలంతా ఊపిరి పీల్చుకున్నారు. వైజాల్ లో ఉన్న హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌(హెచ్‌పీసీఎల్‌) (Hindusthan Petroleum Corp Ltd (HPCL) రిఫైనరీ వద్ద గోధుమ వర్ణంలో దట్టమైన పొగలు ఆకాశాన్ని కమేస్తున్న దృశ్యం చూసి మల్కాపురం, వెంకటాపురం తదితర చుట్టుపక్కల ప్రాంతాలవారు బెంబేలెత్తిపోయారు. అంఫాన్ సైక్లోన్ కల్లోలం, 83 రోజుల తర్వాత మమతా ఇలాకాలో అడుగుపెట్టిన ప్రధాని మోదీ, స్వాగతం పలికిన వెస్ట్ బెంగాల్ సీఎం, అంఫాన్ ప్రభావంపై ఒడిషా, పశ్చిమ బెంగాల్ సీఎంలతో సమీక్ష సమావేశాలు

ఎల్జీ పాలిమర్స్‌ గ్యాస్‌ లీకేజీ దుర్ఘటన ఇంకా కళ్లముందే మెదులుతుండగానే.. హెచ్‌పీసీల్‌ నుంచి రేగుతున్న ఈ పొగ (Thick Smoke from HPCL) స్థానికుల్లో ఆందోళనను రాజేసింది. మళ్లీ ఏ విపత్తు ముంచుకొస్తుందోన్న భయంతో ఇళ్లలో ఉన్నవారు సైతం రోడ్లపైకి వచ్చేసి దూరప్రాంతాలకు వెళ్లిపోయేందుకు ప్రయత్నించగా.. ఇంకొందరు రిఫైనరీ గేటు వద్దకు చేరుకొని వాకబు చేయసాగారు. ఇంతలోనే ఐదు పది నిమిషాల వ్యవధిలోనే పొగలు ఆగిపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.

Here's Video 

ఇలా పొగలు రావడం సాధారణమేనని.. అయితే ఈసారి కాస్త మోతాదు పెరిగిందని, దీని వల్ల ఎటువంటి ప్రమాదం లేదని హెచ్‌పీసీఎల్‌ అధికారులు వివరించారు. ఎఫ్‌సీసీఎల్‌ యూనిట్‌–1 కంబర్షన్‌ సమయంలో పైప్‌లైన్‌లో నిలిచిన వ్యర్థాల కారణంగా పొగ ఎక్కువగా వచ్చిందని.. ఇందులో ఎటువంటి రసాయనాలు గానీ, విషవాయువులు గానీ లేవని భరోసా ఇచ్చారు. జగన్ సర్కారుకు వ్యతిరేకంగా ఫేక్ పోస్టులు, 60 ఏళ్ల బామ్మపై కేసు నమోదు చేసిన సీఐడీ అధికారులు, నేరం రుజువైతే మూడేళ్ళు జైలు శిక్ష, రూ.5 లక్షల జరిమానా విధించే అవకాశం

దాంతో కొంత శాంతించినప్పటికీ.. భవిష్యత్తులో పెనువిపత్తులు సంభవించకుండా తమకు రక్షణ కల్పించాలని స్థానికులు డిమాండ్‌ చేశారు.విషయం తెలుసుకున్న కలెక్టర్‌ వినయ్‌ చంద్‌ ములగాడ తహసీల్దార్‌ రమామణిని అప్రమత్తం చేశారు. వెంటనే హెచ్‌పీసీఎల్‌కు చేరుకున్న ఆమె సంస్థ ప్రతినిధులతో చర్చించి వివరాలు సేకరించారు. స్థానికులకు పరిస్థితిని వివరించి ఆందోళన విరమింపజేశారు.