Ranganayakamma Fake post (Photo-Twitter)

Amaravati, May 19: సోషల్‌ మీడియా పుణ్యమా అని వైరల్ ఏదో..? రియల్ ఏదో..? తెలియని పరిస్థితి నెలకొంటుంది.. కొందరు ఉద్దేశ్యపూర్వకంగా పనిగట్టుకునొ కొన్ని సృష్టించి వైరల్‌గా చేస్తే.. కొందరు తెలిసి తెలియక సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు ఒక్కోసారి వారిని చిక్కుల్లో నెడుతున్నాయి. కాగా ఏపీ ప్రభుత్వానికి (AP Govt) వ్యతిరేకంగా సోషల్ మీడియాలో (Social Media) పోస్ట్ లు షేర్ చేసిన వృద్ధురాలిపై సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు.  సీఎం వైయస్ జగన్‌పై అసభ్యకర పోస్టులు, ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ డీఈఈపై వేటు, ప్రభుత్వంపై విమర్శలు చేస్తే చర్యలు తప్పవన్న సీఐడీ చీఫ్ సునీల్ కుమార్

విశాఖ ఎల్జీ పాలిమర్స్ ఘటనపై (VIzag Gas Leak Tragedy) ప్రభుత్వానికి వ్యతిరేకంగా గుంటూరు లక్ష్మీపురంకు చెందిన పూందోట రంగనాయకమ్మ(60) పోస్ట్ లను (Ranganayakamma Fake post) షేర్ చేసింది. దీంతో సమాచారం అందుకున్న సీఐడీ అధికారులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దీంతో సీఐడీ అధికారులు ఆమెపై కేసు cr no 24/2020, U/S 505(2), 153 (A), 188, 120(B), rw 34 IPC, ఐటీ చట్టంలోని సెక్షన్ 67 కింద కేసు నమోదు చేసి... 41ఏ నోటీసులను అందజేశారు. దర్యాప్తు నేరం రుజువైతే మూడేళ్ళు జైలు శిక్ష, రూ.5 లక్షల జరిమానా విధించే అవకాశం ఉంది. ఫేక్ వార్తలను నమ్మకండి, సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవు, హెచ్చరించిన ఏపీ డీజీపీ దామోదర్ గౌతం సవాంగ్

ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వాన్ని తాను ఉద్దేశపూర్వకంగా విమర్శించలేదని చెప్పారు. తనకు సీఐడీ నోటీసులు ఇవ్వడం ఆశ్చర్యకరంగా ఉందని అన్నారు. విశాఖ గ్యాస్ లీకేజీ ఘటనలో బాధితులకు న్యాయం జరగాలన్నదే తన కోరిక అని అన్నారు. రంగనాయకమ్మపై 41-ఏ కింద సీఐడీ నోటీసులు అందజేసింది. నేరం రుజువైతే ఆమెకు మూడేళ్ల వరకు జైలు శిక్ష, రూ. 5 లక్షల జరిమానా విధించే అవకాశం ఉందని చెప్పారు.ఈ పోస్ట్ పెట్టడానికి ఆమెకు సహకరించిన మల్లాది రఘునాథ్‌ గురించి కూడా దర్యప్తు చేస్తున్నట్టుగా చెబుతున్నారు.

రంగనాయకమ్మపై కేసు నమోదు చేయడం పట్ల టీడీపీ నేత నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా జగన్ సర్కార్ పై విమర్శలు గుప్పించారు. "అమ్మ వయస్సు ఉన్న వారిని కూడా కక్షగట్టి, వెంటాడి వేధిస్తున్నారు. ప్రమాదకరమైన స్టెరీన్ గ్యాస్ లీకేజ్ తో అమాయకుల ప్రాణాలు బలిగొన్న కంపెనీ ప్రతినిధుల్లో ఒక్కరిని కూడా అరెస్ట్ చెయ్యలేదు." అని లోకేష్ విమర్శించారు.

Here's Nara Lokseh Tweet

ఇదిలా ఉంటే విశాఖ ఘటనలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆయా కుటుంబాలకు ఆ ఘటనలో అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందినవారికి, అలాగే ఐదు బాధిత గ్రామాలకు ఏపీ సర్కారు పరిహారం చెల్లించింది. అయినా సోషల్ మీడియాలో ఫేక్ పోస్టులు పోస్ట్ చేస్తున్నారు. దీంతో ఏపీ సర్కారు అప్రమత్తమైంది.

సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ పోస్టింగ్స్ పెట్టిన ఆరోపణలపైనే విజయవాడ పోలీస్ హౌసింగ్ కార్పోరేషన్లో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా పనిచేస్తున్న విద్యాసాగర్ పైనా సీఐడీ కేసులు గత నెలలో కేసు నమోదు చేశారు. ఆయన్ని సస్పెండ్ కూడా చేశారు. నెల రోజుల వ్యవధిలో విశాఖకు చెందిన 60 ఏళ్ల రంగనాయకమ్మ ఇదే తరహాలో ప్రభుత్వ వ్యతిరేక పోస్టింగ్స్ పెట్టడంపై అధికారులు సీరియస్ గా ఉన్నారు. ప్రభుత్వ వ్యతిరేక చర్యలకు పాల్పడే మిగతా వారికి కూడా హెచ్చరికలు జారీ చేసేందుకే ఈ కేసు నమోదు చేసినట్లు సీఐడీ అధికారులు చెబుతున్నారు.

సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేవారు జాగ్రత్తగా వ్యవహరించాలని ఈ ఉదంతం ద్వారా తెలుస్తోందని న్యాయ నిపుణులు సూచిస్తున్నారు. ప్రభుత్వంపై విమర్శలు చేసేవాళ్లు... సద్విమర్శలు చెయ్యాలే తప్ప... అసత్యాలతో విమర్శలు చేస్తూ... పోస్టులు పెడితే... వాటికి బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు