Amaravati, May 12: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డిపై (AP CM YS jagan) అసభ్యకర పోస్టులు పెట్టినందుకు ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ డీఈఈ ఎం.వీ.విద్యాసాగర్‌పై ( AP Police Housing Corporation DEE) ప్రభుత్వం వేటు వేసింది. సీఎం జగన్‌ని, ప్రభుత్వ విధానాలను అసభ్యకరంగా తిడుతూ విద్యాసాగర్ వాట్సాప్ గ్రూప్‌లో (state policies on WhatsApp group) కొన్ని పోస్ట్‌లు పెట్టారు. డీఈఈ పెట్టిన ఈ పోస్ట్‌లను వాట్సాప్‌లో ఉన్న మిగిలిన ఉద్యోగులు సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ (CID chief P.V Sunil Kumar) దృష్టికి తీసుకెళ్లారు. దాన్ని పరిశీలించిన సీఐడీ సునీల్ కుమార్ సెక్షన్ 25 ఏపీఎస్పీహెసీ ప్రకారం విద్యాసాగర్‌పై డిస్ప్లైనరీ యాక్షన్ తీసుకున్నట్లు వెల్లడించారు. రైళ్లను నడపవద్దన్న కేసీఆర్, ప్రజల్లో భయాన్ని తొలగించాలన్న వైయస్ జగన్, ప్రధాని మోదీతో ముగిసిన రాష్ట్రాల ముఖ్యమంత్రుల వీడియో కాన్ఫరెన్స్
ఈ మేరకు ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ, సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ సోమవారం సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు. దుష్ప్రవర్తన, క్రమశిక్షణను ఉల్లంఘించినందుకు సస్పెండ్ చేసినట్లు ఓ ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులుగా ఉంటూ ప్రభుత్వంపై విమర్శలు చేస్తే చర్యలు తప్పదని ఈ సందర్భంగా సునీల్ కుమార్ హెచ్చరించారు. నాలుగవ దశ లాక్‌డౌన్, ఈ నెల 15 లోగా రాష్ట్రాల సీఎంలు తమ అభిప్రాయాలు చెప్పాలన్న ప్రధాని మోదీ, వీడియో కాన్ఫరెన్స్‌లో ఎవరేమన్నారంటే..
ఏపీ సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ మాట్లాడుతూ... ‘డీఈ విద్యాసాగర్ తన మొబైల్ వాట్సాప్ గ్రూప్‌ల్లో కొన్ని ప్రభుత్వ వ్యతిరేక విషయాలను పోస్ట్ చేశారు. ముఖ్యమంత్రిని అసభ్య పదజాలంతో దూషిస్తూ, రాష్ట్ర ప్రభుత్వ విధానాలను తన వాట్సాప్ గ్రూప్‌లలో విమర్శించారు. మా విచారణలో ఆధారాలతో సహా అవన్ని వాస్తవమని తేలాయి. ఉద్యోగులు ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో లేదా బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయకూడదు. అతిక్రమిస్తే రాష్ట్ర ప్రభుత్వ ప్రవర్తనా నియమావళి ప్రకారం క్రమశిక్షణా చర్యలు తీసుకుంటాం’ అని స్పష్టం చేశారు.