AP DGP Warning on Fake News: ఫేక్ వార్తలను నమ్మకండి, సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవు, హెచ్చరించిన ఏపీ డీజీపీ దామోదర్ గౌతం సవాంగ్
Andhra pradesh dgp-gautam-sawang-calls-people-support-janata-curfew (Photo-Facebook)

Amaravati, May 12: ఏపీలో లాక్‌డౌన్‌ (AP Lockdown) ఎత్తేశాక పెద్ద ఎత్తున చోరీలు జరుగుతాయని, నేరాల రేటు పెరిగిపోతుందని జరుగుతున్న ప్రచారాలను నమ్మ వద్దని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ ( AP DGP Gautam Sawang) స్పష్టం చేశారు. పోలీస్‌ హెచ్చరిక పేరుతో సోషల్‌ మీడియాలో (Social Media) వస్తున్న ఫేక్‌ పోస్టింగ్‌లపై ఆయన స్పందించారు.  వైజాగ్‌లో ఒకరి నుంచి 20 మందికి కరోనా, కోలుకున్న కర్నూలు, ఏపీలో 2051కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు, 1056 మంది డిశ్చార్జ్

లాక్‌డౌన్‌ (Lockdown) తర్వాత ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలంటూ పోలీసులు ఇప్పటి వరకూ ఎలాంటి హెచ్చరికలు జారీ చేయలేదని తెలిపారు. ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులేవీ రాష్ట్రంలో లేవని, ఏవైనా సమస్యలుంటే తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇలా తప్పుడు పోస్టులు పెడుతున్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీ డీజీపీ (Damodar Goutam Sawang) హెచ్చరించారు.

ప్రజలకు ఏ ఆపద వచ్చినా వెంటనే 100, 112, 104, 108 నంబర్లకు కాల్‌ చేయాలని సూచించారు. ప్రస్తుత పరిస్థితికి అన్వయించి రోజువారీ జాగ్రత్తలను కూడా జతచేసి సోషల్‌ మీడియా ద్వారా ప్రజలను భయపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని గుర్తించామని అలాంటి వాటిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. లాక్‌డౌన్‌ తర్వాత పిల్లలు, మహిళలను నేరస్తులు టార్గెట్‌ చేస్తారంటూ జరుగుతున్న ప్రచారాలను ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దని కోరారు.  సీఎం వైయస్ జగన్‌పై అసభ్యకర పోస్టులు, ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ డీఈఈపై వేటు, ప్రభుత్వంపై విమర్శలు చేస్తే చర్యలు తప్పవన్న సీఐడీ చీఫ్ సునీల్ కుమార్

రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 2051కి చేరుకుంది. గత 24 గంటల్లో 10,730 మంది శాంపిల్స్‌ పరీక్షించగా.. అందులో 33 మందికి కరోనా సోకినట్టుగా నిర్థారణ అయింది. కొత్తగా చిత్తూరు జిల్లాలో 10, నెల్లూరు జిల్లాలో 9, కర్నూలు జిల్లాలో 9 చొప్పున, కృష్ణా జిల్లాలో 4, పశ్చిమ గోదావరి జల్లా నుంచి ఒక కరోనా కేసు నమోదైంది.