TS CETs 2023 Exam Schedule: తెలంగాణలో అన్నీ ప్రవేశ పరీక్షల షెడ్యూల్ పూర్తి వివరాలు ఇవిగో, మే 7 నుంచి 14 వరకు ఎంసెట్‌ పరీక్ష, మే 29 నుంచి జూన్‌1 వరకు పీజీఈసెట్‌ పరీక్షలు

తెలంగాణలో ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ మంగళవారం విడుదలైంది. ఎంసెట్‌, ఈసెట్‌, లాసెట్‌, ఐసెట్‌, ఎడ్‌సెట్‌ తదితర కామన్‌ ఎంట్రన్స్‌ టెస్టులకు సంబంధించిన పరీక్ష నిర్వాహణ తేదీలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశాల మేరకు అధికారులు ప్రకటించారు.

Representational Image (Photo Credits: PTI)

తెలంగాణలో ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ మంగళవారం విడుదలైంది. ఎంసెట్‌, ఈసెట్‌, లాసెట్‌, ఐసెట్‌, ఎడ్‌సెట్‌ తదితర కామన్‌ ఎంట్రన్స్‌ టెస్టులకు సంబంధించిన పరీక్ష నిర్వాహణ తేదీలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశాల మేరకు అధికారులు ప్రకటించారు. మే 7 నుంచి 14 వరకు ఎంసెట్‌ పరీక్షల నిర్వహించనున్నారు.

7 నుంచి 11 వరకు ఎంసెట్‌ ఇంజినీరింగ్‌, 12 నుంచి 14 వరకు ఎంసెట్‌ అగ్రికల్చర్‌, ఫార్మా పరీక్ష జరగనుంది. మే 18న (TS Edcet) ఎడ్‌సెట్‌, మే 20న (TS Ecet) ఈసెట్‌, మే 25న (TS LAWCET)లాసెట్‌, పీజీ ఎల్‌సెట్‌, మే 26, 27న (TS ICET) ఐసెట్‌, మే 29 నుంచి జూన్‌1 వరకు (TSPGECET)పీజీఈసెట్‌ పరీక్షలు నిర్వహించనున్నట్టు ఉన్నత విద్యామండలి తెలిపింది.

 తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్, విద్యుత్ శాఖలో 1,601 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్, పూర్తి వివరాలు ఇవే..

ఈ మేరకు మంత్రి విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్ లింబాద్రి, వైస్‌ చైర్మన్‌ వీ వెంకటరమణతో సమీక్ష నిర్వహించారు. పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లను చేయాలని తెలిపారు. దరఖాస్తు చేసుకునేందుకు రిజిస్ట్రేషన్‌ ఫీజు, ఇతర వివరాలతో వివరణాత్మక నోటిఫికేషన్‌ను సంబంధిత సెట్‌ కన్వీనర్లు ప్రకటిస్తారని పేర్కొన్నారు. వివిధ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ల షెడ్యూల్‌ కింది విధంగా ఉంది.

► మే 7 నుంచి 11 వరకు ఎంసెట్‌ ఇంజనీరింగ్‌ ప్రవేశ పరీక్ష.

► మే 12 నుంచి 14 వరకు ఎంసెట్‌ అగ్రికల్చర్‌, ఫార్మసీ ప్రవేశ పరీలు.

► మే 18న టీఎస్‌ ఎడ్‌ సెట్‌

►మే 20న టీఎస్‌ ఈసెట్‌

► మే 25న లాసెట్‌(ఎల్‌ఎల్‌బీ), పీజీ లాసెట్‌

► మే 26, 27న టీఎస్‌ పీజీ ఐసెట్‌

►మే, 29 నుంచి జూన్‌ ఒకటి వరకు పీజీ ఈసెట్‌య నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement