CSpace Kerala Govt OTT: Pic: File Photo/ Kerala Govt official

CSpace- Government OTT: భారతదేశంలోనే తొలిసారిగా ప్రభుత్వ అధ్వర్యంలో నడిచే OTT ప్లాట్‌ఫారమ్ ఆవిష్కరణ జరిగింది. 'CSpace' పేరుతో కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఓవర్-ది-టాప్ (OTT) ప్లాట్‌ఫారమ్ ను ప్రారంభించి, డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో నూతన అధ్యాయానికి నాంది పలికింది. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ మార్చి 7, గురువారం నాడు తమ రాష్ట్ర స్వంత OTT ప్లాట్‌ఫారమ్ అయిన 'సి-స్పేస్' ను స్థానిక కైరలీ థియేటర్‌లో అధికారికంగా ప్రారంభించారు.

CSpace అనేది దేశంలోనే మొట్టమొదటి ప్రభుత్వ ఆధీనంలో నడిచే OTT ప్లాట్‌ఫారమ్ కావడం విశేషం. కేరళ ప్రభుత్వ సాంస్కృతిక వ్యవహారాల శాఖ అధ్వర్యంలో 'కేరళ స్టేట్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్' (KSFDC) ఈ ఓటీటీ నిర్వహణ బాధ్యతలు చూసుకుంటుంది.

కేరళ ప్రభుత్వం లాంచ్ చేసిన ఈ CSpace ప్లాట్‌ఫారమ్ ప్రజల కోసం రూపొందించినది. ప్రజలకు సమాచారంతో పాటు వినోదాత్మక కంటెంట్ ను అందించడమే లక్ష్యంగా దీనిని రూపొందించారు. నేడు వివిధ ప్రైవేట్ ఓటీటీలలో విధ్వేషపూరితమైన, నేరపూరితమైన శృంగారపరమైన కంటెంట్ మితిమీరుతుంది. అందుకు భిన్నంగా CSpace ఓటీటీలో అర్థవంతమైన కంటెంట్ ప్రసారం చేయడం ద్వారా ప్రజలకు మంచి విలువలు నేర్పడం, జ్ఞానాన్ని అందించడం కోసం ఇది ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.

CSpace OTT ప్లాట్‌ఫారమ్ కోసం 60 మంది సభ్యులతో కూడిన క్యూరేటర్ ప్యానెల్‌ను ఏర్పాటు చేశారు. ఈ బృందంలో బెన్యామిన్, సంతోష్ శివన్, శ్యామప్రసాద్, సన్నీ జోసెఫ్ వంటి కళారంగ ప్రముఖులు సభ్యులుగా ఉన్నారు. ఈ ప్యానెల్ ఓటీటీలో ఎలాంటి కంటెంట్ ప్రసారం చేయాలో క్యూరేట్ చేస్తుంది. ఎంపిక చేసిన కంటెంట్ వీడియోలను కనీసం ముగ్గురు సభ్యులు రివ్యూ చేసి వాటిని ఆమోదించిన తర్వాతే అవి ప్రసారం చేయబడతాయి.

మొదటి దశలో భాగంగా క్యూరేటర్లు ఇప్పటికే 35 ఫీచర్ ఫిల్మ్‌లు, ఆరు డాక్యుమెంటరీలు, ఒక షార్ట్ ఫిల్మ్‌తో సహా మొత్తం 42 చిత్రాలను CSpaceలో ప్రసారం చేసేందుకు ఎంపిక చేశారు. జాతీయ లేదా రాష్ట్ర అవార్డులను గెలుచుకున్న చిత్రాలు, ప్రధాన చలన చిత్రోత్సవాలలో ప్రదర్శించబడిన చలనచిత్రాలు కూడా ఈ ప్లాట్‌ఫారమ్ ద్వారా స్ట్రీమింగ్ చేస్తారు.

అయితే, ఇది ప్రభుత్వ అనుబంధంగా పనిచేసే ఓటీటీ ప్లాట్‌ఫారమ్ అయినప్పటికీ, CSpaceలో సినిమాలు ఉచితంగా చూడటానికి అవకాశం లేదు. CSpace 'పే పర్ వ్యూ' మోడల్‌ను అవలంబిస్తుంది, ఒక్కో సినిమాకి వినియోగదారుల నుండి రూ. 75 వసూలు చేస్తుంది.



సంబంధిత వార్తలు

Latest OTT Releases This Week: ఒక్క రోజే 10 సినిమాలు ఓటీటీలో స్ట్రీమింగ్, ఏ సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో ఓ లుక్కేసుకోండి

OTT From Central Government: కేంద్రం నుంచి సొంత ఓటీటీ ప్లాట్‌ ఫాం.. భారతీయ సమాజం, సంస్కృతీ సంప్రదాయాల ప్రసారమే లక్ష్యంగా ప్రారంభం.. తొలి రెండేండ్లు ఫ్రీ

Jio New OTT Plan: గుడ్ న్యూస్, ఒకే రీఛార్జిపై 15 ఓటీటీలు అందిస్తున్న జియో, రూ. 888 పోస్ట్‌పెయిడ్‌ ప్లాన్ వివరాలు ఓ సారి తెలుసుకోండి

This Week Movies- OTT Releases: ఈ నెల 26 నుంచి నెట్ ఫ్లిక్స్‌లో టిల్లూ స్క్వేర్ సినిమా స్ట్రీమింగ్, ఈవారం ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే కొత్త చిత్రాలు ఇవిగో,,

This Week Movies- OTT Releases: నేడే చూడండి..! హనుమాన్ ఓటీటీలోకి వచ్చేస్తోంది, ఈవారం థియేటర్‌లలో విడుదలైన సినిమాలు, సంక్షిప్త రివ్యూలు, ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే కొత్త చిత్రాలు, వెబ్ సిరీస్‌ల విశేషాలు ఇవిగో!

Maha Shivratri Week Movies- OTT Releases: హనుమాన్ ఓటీటీపై తాజా అప్‌డేట్ ఏమిటి, విశ్వక్ సేన్ గామి, గోపిచంద్ భీమా రివ్యూలు ఎలా ఉన్నాయి, శివరాత్రి సందర్భంగా ఈవారం కొత్త చిత్రాల విశేషాలు తెలుసుకోండి!

This Week Movies- OTT Releases: నేడే చూడండి..! ఈవారం థియేటర్‌లలో విడుదలైన సినిమాలు, ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న చిత్రాలు, వెబ్ సిరీస్‌ల విశేషాలు ఇవిగో!

This Week Movies- OTT Releases: ఊరు పేరు భైరవకోన, రాజధాని ఫైల్స్ సినిమాల రివ్యూలు ఎలా ఉన్నాయి? ఈవారం థియేటర్‌లలో విడుదలైన సినిమాలు, ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న చిత్రాలు, వెబ్ సిరీస్‌ల విశేషాలు ఇవిగో!