Fire Accident in UP: ఉత్తర ప్రదేశ్‌ ఝాన్సీ జిల్లాలోని మెడికల్ కాలేజీలో ఘోర అగ్ని ప్రమాదం.. రోజుల వయసున్న పది మంది నవజాత శిశువులు సజీవ దహనం.. (వీడియో)

ఉత్తర ప్రదేశ్‌ లో ఘోరం జరిగింది. ఝాన్సీ జిల్లా మహారాణి లక్ష్మీ బాయి మెడికల్‌ కాలేజీలోని పిల్లల వార్డులో అర్ధరాత్రి ఘోర అగ్నిప్రమాదం సంభవించింది.

Fire Accident in UP (Credits: X)

Newdelhi, Nov 16: ఉత్తర ప్రదేశ్‌ లో (Uttarpradesh) ఘోరం జరిగింది. ఝాన్సీ జిల్లా మహారాణి లక్ష్మీ బాయి మెడికల్‌ కాలేజీలోని పిల్లల వార్డులో అర్ధరాత్రి ఘోర అగ్నిప్రమాదం (Fire Accident in UP) సంభవించింది. ఈ ప్రమాదంలో రోజుల వయస్సున్న పది మంది నవజాత శిశువులు మృత్యువాత పడ్డారు. ఆస్పత్రి ఎన్ఐసీయూ విభాగంలో రాత్రి 10.45 గంటలకు ఆక్సీజన్‌ కాన్సన్‌ ట్రేటర్‌ లో విద్యుత్‌ షాట్​ సర్క్యూట్‌ జరిగి మంటలు చెలరేగాయి. పిల్లల వార్డు గదుల్లో ఆక్సీజన్‌ పూర్తిగా వ్యాపించి ఉండటం వల్ల మంటలు భారీగా విస్తరించాయని ఆస్పత్రి సూపరిండెంట్‌ సచిన్‌ మహోర్‌ తెలిపారు. చిన్నారుల మృతితో ఆస్పత్రి ప్రాంగణంలో కన్నవారి రోదనలు మిన్నంటాయి.

Here's Video:

అప్పుడే క్లారిటీ

సమాచారం తెలిసిన వెంటనే రంగంలోకి దిగిన అగ్నిమాపకదళం చర్యలు చేపట్టింది. ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంపై 12 గంటల్లోగా నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. విచారణ నివేదిక వచ్చిన తర్వాత ఈ ప్రమాదంపై  ఓ క్లారిటీ వస్తుందని ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్ తెలిపారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement