New Rs.2000 Notes: రూ.2 వేల నోటులో భారీ మార్పులు, కదిలిస్తే రంగులు మారిపోతాయి, మధ్యలో మహాత్మాగాంధీ బొమ్మ, ఇతర మార్పులు ఓ సారి తెలుసుకోండి

మరో కొత్త రెండు వేల రూపాయల నోటును తీసుకొస్తోంది. సరికొత్త డిజైన్ మహాత్మాగాంధీ బొమ్మతో ముస్తాబవుతోన్న కొత్తనోటులో కొన్ని కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. కలర్, సైజ్, థీమ్ అన్నింటిలోనూ మార్పులు ఉన్నాయట. మంగళయాన్ రివర్స్‌లో ఉండటమే కాదు మాగెంటా రంగులో రెడీ అయింది.

10 key things you should know about 2000 rupee note

New Delhi, Febuary 23: పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రధాని నరేంద్ర మోడీ ( PM Modi) సంచలన ప్రకటన చేసిన తర్వాత కరెన్సీ కోసం ప్రజలు తీవ్రమైన ఇబ్బంది పడ్డారు.. ఆ తర్వాత ఆర్బీఐ (Reserve Bank of India (RBI) రూ.2 వేల నోటు తెచ్చినా చిల్లర కష్టాలు ప్రజలను బాగా వెంటాడాయి.

ఆ తర్వాత కొత్త రూ.500, రూ.200, రూ.100, రూ.50, రూ.20, రూ.10 నోట్లను తెచ్చినా పాత నోట్లను ఆర్‌బీఐ అలాగే కొనసాగిస్తోంది. తాజాగా రూ.2 వేల నోటు (New Rs.2000 Note) ముద్రను కూడా ఆపేసింది. ఇదే విషయాన్ని సమాచార హక్కు చట్టం కింద ఆర్బీఐయే వెల్లడించింది.

అయితే ఇప్పుడు దాని స్థానంలో మరో కొత్త రెండు వేల రూపాయల నోటును తీసుకొస్తోంది. సరికొత్త డిజైన్ మహాత్మాగాంధీ బొమ్మతో ముస్తాబవుతోన్న కొత్తనోటులో కొన్ని కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. కలర్, సైజ్, థీమ్ అన్నింటిలోనూ మార్పులు ఉన్నాయట. మంగళయాన్ రివర్స్‌లో ఉండటమే కాదు మాగెంటా రంగులో రెడీ అయింది.

ఈ కొత్త నోటు వివరాలను ఓ సారి పరిశీలిస్తే..

1. కొత్త నోట్ సైజ్ 66mm x 166mm

2. లైట్ వెలుగులో పెట్టినప్పుడు దాగి ఉన్న రూ.2వేలు గుర్తు కనిపిస్తుంది.

3. కంటికి 45డిగ్రీల యాంగిల్‌లో 2వేల ప్రత్యేక సింబల్ కనిపిస్తుంది.

4. 2000 సంఖ్య దేవనాగరి లిపిలో ఉంటుంది.

5. కచ్చితంగా నోటు మధ్యలో మహాత్మగాంధీ బొమ్మ.

6. 'RBI', '2000' అక్షరాలు మైక్రో సైజులో ఉంటాయి.

7. నోటు కదిలిస్తుంటే 'Bharat', RBI, 2000అనే పదాలు రంగులు మారుతూ ఉంటాయి. గ్రీన్ నుంచి బ్లూ కలర్లో మారతాయి.

8. ఆర్బీఐ చిహ్నానికి కుడివైపున గవర్నర్ సంతకం ఉంటుంది.

9. మహాత్మాగాంధీ బొమ్మ, 2000గుర్తు వాటర్‌మార్క్, కుడివైపున అశోక పిల్లర్ చిహ్నం.

10. ఎడమ నుంచి కుడి వైపుకు నెంబర్లు సైజు పెరుగుతూ ఉంటాయి.

11. కింది కుడివైపున 2000సంఖ్యలో గ్రీన్ నుంచి బ్లూ రంగు మారుతూ కనిపిస్తుంది.

సెక్యూరిటీ ఫీచర్లను అప్‌డేట్ చేస్తూ.. బ్యాంకు నోట్లపై వాటర్ మార్క్, సెక్యూరిటీ థ్రెడ్, సంఖ్యలో రంగులు మారుతూ ఉండటం, ఇంక్ కలర్లో మార్పు, బ్లీడ్ లైన్స్, యాంగిల్ మార్చి చూస్తుంటే మార్పులు, వంచి చూస్తే కనిపించే దాగి ఉన్న 2000సింబల్‍‌లు కొత్త నోట్లలో మార్పులుగా కనిపిస్తున్నాయి.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement