Chikkaballapur Accident: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం, ఆగి ఉన్నకారును ఢీకొట్టిన కారు, 12 మంది మృతి, చనిపోయినవారంతా ఏపీకి చెందినవారే!

కర్ణాటకలోని చిక్‌బళ్లాపూర్‌ (Chikkaballapur) వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం ఉదయం చిక్‌ బళ్లాపూర్‌ సమీపంలో వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి ఆగిఉన్న లారీని ఢీకొట్టింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న 12 మంది మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.

Chikkaballapur Accident (PIC@ X)

Chikkaballapur, OCT 26 : కర్ణాటకలోని చిక్‌బళ్లాపూర్‌ (Chikkaballapur) వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం ఉదయం చిక్‌ బళ్లాపూర్‌ సమీపంలో వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి ఆగిఉన్న లారీని ఢీకొట్టింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న 12 మంది మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతులను ఆంధ్రప్రదేశ్‌లోని సత్యసాయి జిల్లా గోరంట్ల (Gorantla) మండలానికి చెందినవారిగా గుర్తించారు.

 

గోరంట్ల నుంచి కర్ణాటకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. మృతుల వివరాలను సేకరిస్తున్నారు. తెల్లవారుజామున మంచు కారణంగా ఈ ప్రమాదం జరిగిందా? లేకపోతే డ్రైవర్ అతివేగమే కారణమా? అన్నకోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement