Questioning Rahul Gandhi: మూడో రోజు ముగిసిన రాహుల్ గాంధీ విచారణ, శుక్రవారం మళ్లీ రావాలంటూ రాహుల్‌కు ఈడీ ఆదేశాలు, ఎలాంటి అవకతవకలకు ఛాన్స్ లేదంటూ బల్లగుద్ది వాదించిన రాహుల్

నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED)విచారణ మూడో రోజు ముగిసింది. బుధవారం దాదాపు తొమ్మిది గంటల పాటు రాహుల్ గాంధీని అధికారులు విచారించారు. అయితే విచారణ (Questioning) పూర్తికాలేదని, మళ్లీ శుక్రవారం విచారణకు హాజరు కావాలని రాహుల్ గాంధీకి ఈడీ (ED) అధికారులు స్పష్టం చేశారు.

New Delhi, June 15: నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED)విచారణ మూడో రోజు ముగిసింది. బుధవారం దాదాపు తొమ్మిది గంటల పాటు రాహుల్ గాంధీని అధికారులు విచారించారు. అయితే విచారణ (Questioning) పూర్తికాలేదని, మళ్లీ శుక్రవారం విచారణకు హాజరు కావాలని రాహుల్ గాంధీకి ఈడీ (ED) అధికారులు స్పష్టం చేశారు. రాహుల్ వెంట ఆయన సోదరి, కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) కూడా ఉన్నారు. రాహుల్ గాంధీని ఉదయం 11.30గంటలకు ప్రశ్నించడం ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. దాదాపు నాలుగు గంటల విచారణ అనంతరం మధ్యాహ్నం 3.30గంటల ప్రాంతంలో రాహుల్ గాంధీ బయటకువచ్చి అర్ధగంట తర్వాత మళ్లీ ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. అయితే విచారణ పూర్తికాలేదని, మళ్లీ శుక్రవారం విచారణకు హాజరు కావాలని రాహుల్ గాంధీకి ఈడీ అధికారులు సూచించినట్లు తెలిసింది.

ఇదిలా ఉంటే ఈడీ విచారణలో యంగ్ ఇండియన్ సంస్థ నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని రాహుల్ చెప్పినట్లు సమాచారం. యంగ్ ఇండియన్ లిమిటెడ్ (IYL) లాభాపేక్షలేని దాతృసంస్థ అని, అది కంపెనీల చట్టంలోని ప్రత్యేక నిబంధన కింద ఏర్పడిందని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.

5G Spectrum: 5జీ సేవలపై కేంద్రం కీలక నిర్ణయం, 5జీ స్పెక్ట్రమ్ వేలం నిర్వహణకు అనుమతించిన కేంద్ర కేబినెట్, జులై నెలాఖరుకి వీటిని వేలానికి తీసుకురానున్నట్టు తెలిపిన మోదీ సర్కారు  

అయితే రాహుల్ వాదనను ఈడీ అధికారులు తోసిపుచ్చుతూ 2010లో యంగ్ ఇండియా లిమిటెడ్ ఏర్పడినప్పటి నుండి ఎలాంటి స్వచ్ఛంద కార్యక్రమాలు చేపట్టలేదని పేర్కొన్నట్లు సమాచారం. యంగ్ ఇండియన్ ద్వారా ధార్మిక పనిచేసి ఉంటే అందుకు సంబంధించిన పత్రాలు లేదా ఆధారాలు సమర్పించాలని అధికారులు రాహుల్ గాంధీని కోరినట్లు తెలిసింది.

President Election 2022: రాష్ట్రపతి ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల, జులై 18న ఎన్నికలు, జులై 21న కౌంటింగ్, జులై 24తో ముగియనున్న ప్రస్తుత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పదవీ కాలం  

మరోవైపు రాహుల్ గాంధీని ఈడీ విచారించడాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ నేతలు చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఆందోళనకారులను అడ్డుకునే క్రమంలో పోలీసులు, కాంగ్రెస్ నేతల మధ్య వాగ్వివాదం, ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో పలువురు కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్టు చేశారు.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Accident Averted at Hyderabad Airport: వీడియో ఇదిగో, శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో విమానానికి తప్పిన పెను ప్రమాదం, 150 మంది ప్రయాణికులు సేఫ్

MLC Candidates: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ టికెట్ దాసోజు శ్రవణ్ కు.. కాంగ్రెస్ అభ్యర్ధులుగా అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నేడు నామినేషన్ల దాఖలుకు చివరి రోజు

Congress MLC Candidates: మరోసారి చట్టసభల్లోకి రాములమ్మ, ఎట్టకేలకు అద్దంకి దయాకర్‌కు ఎమ్మెల్సీ సీటు, ముగ్గురు అభ్యర్ధుల్ని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ

Karnataka: రష్మిక మందన్నకు రక్షణ కల్పించాలి.. కాంగ్రెస్ ఎమ్మెల్యే రవి కుమార్ గౌడ వివాదాస్పద నేపథ్యంలో రష్మికకు మద్దతుగా కొడవ సమాజం

Advertisement
Share Now
Advertisement