Delhi Rape Case: సిగ్గుచేటు..94 ఏళ్ల ముసలమ్మపై అత్యాచారం. దేశ రాజధాని ఢిల్లీలో దారుణమైన ఘటన, నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు, బాధిత వృద్దురాలిని పరామర్శించిన ఢిల్లీ క‌మిష‌న్ ఫ‌ర్ ఉమెన్ చీఫ్

దేశ రాజధాని ఢిల్లీలో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. కామాంధులకు వయసు కూడా తెలియడం లేదు. 90 ఏళ్ల వృద్ధురాలిపై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్ప‌డ్డాడు. నజఫ్‌గర్ ప్రాంతంలోని ఛావ్లాలో సోమవారం సాయంత్రం చోటు చేసుకున్న ఈ ఘటనపై ఢిల్లీ మహిళా కమిషన్(DCW) సీరియస్ అయ్యింది. నిందితుడిని అరెస్టు చేసి (37-year-old man arrested) ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు డీసీడబ్ల్యూ ధృవీకరించింది.

Representational Image (Photo Credits: File Image)

New Delhi, Sep 9: దేశ రాజధాని ఢిల్లీలో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. కామాంధులకు వయసు కూడా తెలియడం లేదు. 90 ఏళ్ల వృద్ధురాలిపై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్ప‌డ్డాడు. నజఫ్‌గర్ ప్రాంతంలోని ఛావ్లాలో సోమవారం సాయంత్రం చోటు చేసుకున్న ఈ ఘటనపై ఢిల్లీ మహిళా కమిషన్(DCW) సీరియస్ అయ్యింది. నిందితుడిని అరెస్టు చేసి (37-year-old man arrested) ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు డీసీడబ్ల్యూ ధృవీకరించింది. ఆ వ్య‌క్తిని పోలీసులు (Delhi Police) అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం ఢిల్లీ చావ్లాలోనా న‌జాఫ్‌గంజ్ ప్రాంతానికి చెందిన 37 ఏళ్ల వ్య‌క్తి అదే అదే ప్రాంతంలో నివ‌సిస్తున్న వృద్ధురాలిపై లైంగిక‌దాడికి తెగ‌బ‌డ్డాడు.

ఈ ఘ‌ట‌న స్థానికంగా క‌ల‌క‌లం సృష్టించింది. నిందితుడిని క‌ఠినంగా శిక్షించాల‌ని ప‌లువురు డిమాండ్ చేశారు. మంగ‌ళ‌వారం ( డీసీడబ్ల్యూ ) చీఫ్ స్వాతి మాలివాల్ (Delhi Commission for Women (DCW) chief Swati Maliwal) బాధిత వృద్దురాలిని ప‌రామ‌ర్శించారు. కామాంధుడి లైంగిక దాడిలో (Delhi Rape Incident) ఆమె తీవ్ర గాయాలపాలైనట్లు తెలిపారు. స్వామి మనివాల్ స్వయంగా ఆ వృద్ధురాలిని కలిసి...దారుణ ఘటనపై ఆరా తీశారు.

Here's Delhi Commission for Women (DCW) chief Swati Maliwal Tweet

ఎంత ప్రాధేయపడినా వినిపించుకోకుండా తనపై అఘాయిత్యానికి పాల్పడినట్లు కంటతడి పెట్టుకున్న ఆ వృద్ధురాలు...నిందితుడిని ఉరితీయాలని కోరినట్లు తెలిపారు. కాగా ఘ‌ట‌న జ‌రిగిన 24 గంట‌ల్లోనే పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేయ‌డం విశేషం. నిందితుడు ప్లంబర్ పనులు చేసేవాడని పోలీసులు నిర్థారించారు. పోలీసుల చ‌ర్య‌ను ప్ర‌శంసిస్తూ ప‌లువురు నెటిజ‌న్లు ట్వీట్ చేస్తున్నారు.

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement