Assam: దారుణం..పోర్న్ వీడియోలు చూడలేదని బాలికను కిరాతకంగా చంపేసిన ముగ్గురు బాలలు, ఆన్‌లైన్ క్లాసుల కోసం తండ్రి కొనిచ్చిన స్మార్ట్‌ఫోన్‌లో కొన్ని వందల సెక్స్ వీడియోలు, చిత్రాలు
తమతో కలిసి సెల్‌ఫోన్‌లో అశ్లీల చిత్రాలు చూసేందుకు ఒప్పుకోలేదన్న కోపంతో ముగ్గురు 8 నుంచి 10 సంవత్సరాలు ఉన్న బాలలు ఆరేళ్ల బాలికను (six-year-old girl) రాళ్లతో కొట్టి దారుణంగా చంపేశారు. అస్సాంలోని నగావ్ జిల్లాలో (Assam’s Nagaon district) జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనమైంది.
Nagaon, Oct 22: అస్సాంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తమతో కలిసి సెల్‌ఫోన్‌లో అశ్లీల చిత్రాలు చూసేందుకు ఒప్పుకోలేదన్న కోపంతో ముగ్గురు 8 నుంచి 10 సంవత్సరాలు ఉన్న బాలలు ఆరేళ్ల బాలికను (six-year-old girl) రాళ్లతో కొట్టి దారుణంగా చంపేశారు. అస్సాంలోని నగావ్ జిల్లాలో (Assam’s Nagaon district) జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనమైంది. అక్కడ పోలీసుల కథనం ప్రకారం.. కలియబర్ పట్టణ పరిధిలోని మిస్సా గ్రామానికి చెందిన 11 ఏళ్లలోపు వయసున్న ముగ్గురు బాలలు అశ్లీల చిత్రాలు చూసేందుకు అలవాటు పడ్డారు. వీరు మంగళవారం మధ్యాహ్నం బాధిత బాలికను గ్రామంలోని క్వారీ వద్దకు రమ్మని పిలిచారు.
తమతోపాటు తెచ్చిన సెల్‌ఫోన్‌లోని నీలి చిత్రాలను చూడాలని బాలికను ఒత్తిడి చేశారు. అందుకు చిన్నారి నిరాకరించడంతో (6-yr-old Girl killed for resisting sexual assault) కోపంతో పక్కనే ఉన్న రాళ్లతో ఆమెను కొట్టి చంపేశారు. నిందితులైన బాలల్లో ఒకరు ఆన్‌లైన్ తరగతులకు హాజరయ్యేందుకు అతడి తండ్రి తన స్మార్ట్‌ఫోన్ ఇచ్చాడు. అందులో అప్పటికే అతడు డౌన్‌లోడ్ చేసి పెట్టుకున్న లెక్కలేనన్ని నీలి చిత్రాలు ఉన్నాయి. మిగతా ఇద్దరు స్నేహితులతో కలిసి బాలుడు వాటిని చూడడాన్ని అలవాటు చేసుకున్నాడు.
ఈ క్రమంలో బాలికను పిలిచారు. ఆమె వాటిని చూసేందుకు నిరాకరించడంతో హత్య చేశారు. 24 గంటల్లోనే పోలీసులు ఈ కేసును ఛేదించారు. క్వారీలోని మరుగుదొడ్డి వద్ద బాలిక మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తు అనంతరం నిందితులను అరెస్ట్ చేశారు. నేరాన్ని దాచేందుకు యత్నించిన నిందితుల్లో ఒకరి తండ్రిని కూడా అరెస్ట్ చేశారు. సంచలనం సృష్టించిన ఈ కేసు గురించి ఎస్పీ ఆనంద్ మిశ్రా మాట్లాడుతూ.. సమాజంలో నైతిక విలువలు పడిపోతే దానికి బాధ్యత మనమే వహించాల్సి ఉంటుందని, ఈ ఘటన అందుకు నిదర్శమని అన్నారు.
Here's Nagaon Police Tweet
కాగా సాక్ష్యాలను నాశనం చేశారనే ఆరోపణలతో నిందితుల్లొ ఒకరి తల్లిదండ్రులను పోలీసులు అరెస్టు చేశారు. మైనర్లను జువైనల్ జస్టిస్ బోర్డు ముందు హాజరుపరిచి రిమాండ్ హోమ్‌కు పంపగా, తల్లిదండ్రులను గురువారం స్థానిక కోర్టు జ్యుడీషియల్ కస్టడీకి రిమాండ్ చేసిందని పోలీస్ అధికారులు తెలిపారు.