CM Revanth Reddy: ఆర్య వైశ్యులు తెలంగాణకు బ్రాండ్ అంబాసిడర్లు, హైదరాబాద్‌లో మాజీ సీఎం రోశయ్య విగ్రహం ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి

రాష్ట్ర ఆర్థిక ఎదుగుదల ఆర్యవైశ్యుల చేతిలో ఉందని..వీరంతా తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్లు కావాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మాజీ ముఖ్యమంత్రి రోశయ్య 3 వ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నారు రేవంత్. ఆర్య వైశ్యుల వ్యాపారాలకు ఎలాంటి అనుమతులైనా ప్రభుత్వం సకాలంలో ఇస్తుందని...రాజకీయాల్లో ఆర్య వైశ్యులకు సముచిత స్థానం ఇస్తాం అని తేల్చిచెప్పారు.

Telangana CM Revanth Reddy remembers Konijeti Rosaiah(X)

Hyd, Dec 4:  రాష్ట్ర ఆర్థిక ఎదుగుదల ఆర్యవైశ్యుల చేతిలో ఉందని..వీరంతా తెలంగాణ బ్రాండ్  అంబాసిడర్లు కావాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మాజీ ముఖ్యమంత్రి రోశయ్య 3 వ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నారు రేవంత్. ఆర్య వైశ్యుల వ్యాపారాలకు ఎలాంటి అనుమతులైనా ప్రభుత్వం సకాలంలో ఇస్తుందని...రాజకీయాల్లో ఆర్య వైశ్యులకు సముచిత స్థానం ఇస్తాం అని తేల్చిచెప్పారు.

తాను హైదరాబాద్ వ్యక్తినని గతంలో రోశయ్య స్పష్టం చేశారుని గుర్తు చేసిన సీఎం...హైదరాబాద్ నగరంలో  రాష్ట్ర ప్రభుత్వం తరఫున రోశయ్య విగ్రహం ఏర్పాటు చేస్తాం అన్నారు. రోశయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ద్వారా సమాజానికి మంచి స్పూర్తి ఇచ్చినట్లు అవుతుందన్నారు. శాసనమండలి, శాసనసభలో పోటీ పడి స్పీచ్ ఇవ్వాలన్న స్ఫూర్తిని రోశయ్య మాకు ఇచ్చారు అన్నారు.

ఉమ్మడి రాష్ట్రంలో ఆర్థిక మంత్రి గా రోశయ్య క్రమశిక్షణ పాటించడం వల్లనే 16 వేల కోట్ల మిగులు బడ్జెట్ తో తెలంగాణ ఏర్పడిందని తెలిపారు. నీటి పారుదల శాఖ పైన మండలిలో నేను మాట్లాడినప్పుడు నన్ను తన ఛాంబర్ కు పిలిపించుకొని ప్రోత్సహించారు అని గుర్తు చేశారు. ప్రతిపక్షం లో ఉన్నప్పుడు ప్రశ్నించాలి.. పాలక పక్షంలో ఉన్నప్పుడు పరిష్కరించాలని రోశయ్య తనకు సూచించారన్నారు. చట్టసభల్లో అనాటి స్పూర్తి కొరవడింది.. ప్రతిపక్షాలకు సభలో మాట్లాడే అవకాశం ఇవ్వొద్దన్నట్లుగా పరిస్థితులు తయారయ్యాయి అన్నారు.

సీఎంగా, గవర్నర్ గా,వివిధ హోదా ల్లో 50 యేళ్ల పైగా రాజకీయాల్లో గొప్పగా రాణించారు అన్నారు. తమిళనాడు గవర్నర్ గా ఎవరు వెళ్లినా వివాదాల్లో కూరుకుపోతుంటారు..కాని రోశయ్య అక్కడ వివాదాలు లేకుండా రాణించారు...అ నాటి ముఖ్యమంత్రులకు రోశయ్య కుడి భుజం లా వ్యవహారించడం వల్లనే వారు సమర్థంగా పనిచేశారు అన్నారు. రోశయ్య లాంటి సహచరులు ఇప్పుడు లేకపోవడం పెద్ద లోటు...ప్రతిపక్షాల నుంచి వచ్చే ప్రశ్నల నుంచి ప్రభుత్వాన్ని  రోశయ్య కంచె వేసి కాపాడేవారు అన్నారు.  గ్రూప్-4 విజేతలకు నేడు నియామక పత్రాలు అందజేయనున్న సీఎం రేవంత్,పెద్దపల్లిలో 8 వేల 143 మందికి సీఎం చేతుల మీదుగా నియామక పత్రాలు

నెంబర్ 2 స్థానంలో రోశయ్య ఉండాలని ఆ నాటి ముఖ్యమంత్రులు కోరుకున్నారు...ముఖ్యమంత్రి స్థానం కోసం ఏ నాడు రోశయ్య తాపత్రయపడలేదు అన్నారు. పార్టీ పట్ల ఆయన నిబద్ధత కారణంగానే  క్లిష్ట సమయంలో రోశయ్యను ముఖ్యమంత్రి చేయాలని సోనియా గాంధీ నిర్ణయించారు..రోశయ్య నిబద్దత కారణంగానే అన్ని హోదాలు ఆయన ఇంటికి వచ్చాయి అని వెల్లడించారు.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Group-2 Results Today: నేడు గ్రూప్‌-2 ఫలితాలు.. జనరల్‌ ర్యాంకింగ్‌ లిస్టును విడుదలచేయనున్న టీజీపీఎస్సీ.. ఇప్పటికే విడుదలైన ల్యాబ్‌ టెక్నీషియన్‌ పోస్టుల పరీక్ష ఫలితాలు

Telangana Group-1 Results Released: తెలంగాణ గ్రూప్ -1 పరీక్ష ఫలితాలు విడుదల, అభ్యర్థులు మార్కులను tspsc.gov.in ద్వారా చెక్ చేసుకోవచ్చు

Pranay 'Honour Killing' Case: ఆరేళ తర్వాత ప్రణయ్ హత్య కేసులో కీలక తీర్పు, ఒకరికి ఉరి, ఆరుగురికి జీవితఖైదు విధించిన నల్గొండ కోర్టు, 2018లో జరిగిన మిర్యాలగూడ పరువు హత్య కేసు వివరాలు ఇవే..

MLC Candidates: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ టికెట్ దాసోజు శ్రవణ్ కు.. కాంగ్రెస్ అభ్యర్ధులుగా అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నేడు నామినేషన్ల దాఖలుకు చివరి రోజు

Advertisement
Advertisement
Share Now
Advertisement