CM Revanth Reddy: ఢీల్లీ, జైపూర్‌కు సీఎం రేవంత్ రెడ్డి, మూడు రోజుల పర్యటన, ఈసారైనా నామినేటెడ్ పదవుల భర్తీపై క్లారిటీ వచ్చేనా?

సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు. 11,12,13 మూడు రోజుల పాటు ఢిల్లీతో పాటు జైపూర్‌లో పర్యటించనున్నారు రేవంత్. ఇవాళ సాయంత్రం కుటుంబ సభ్యులతో కలిసి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వెళ్లనున్న రేవంత్... అక్కడి నుండి ఢిల్లీ తర్వాత జైపూర్‌కు చేరుకుంటారు

Telangana CM Revanth Reddy Delhi and Jaipur tour updates(X)

Hyd, Dec 11:  సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు. 11,12,13 మూడు రోజుల పాటు ఢిల్లీతో పాటు జైపూర్‌లో పర్యటించనున్నారు రేవంత్. ఇవాళ సాయంత్రం కుటుంబ సభ్యులతో కలిసి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వెళ్లనున్న రేవంత్... అక్కడి నుండి ఢిల్లీ తర్వాత జైపూర్‌కు చేరుకుంటారు.

జైపూర్‌లో బంధువుల వివాహానికి హాజరవుతారు. అనంతరం ఢిల్లీకి చేరుకుని పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో కేంద్రమంత్రులను కలవనున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు సమస్యలపై కేంద్రమంత్రలను విన్నవించనున్నారు. అలాగే రాష్ట్రానికి రావాల్సిన నిధులపై విజ్ఞప్తి చేయనున్నారు.

ఇక ఢిల్లీ పర్యటనలో భాగంగా కాంగ్రెస్ పెద్దలను కలవనున్నారు రేవంత్. పీసీసీ అధ్యక్షుడి నియామకం మాత్రమే జరుగగా పూర్తిస్థాయి కమిటీ ఏర్పాటుపై చర్చించనున్నారు. ముఖ్యంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఉపాధ్యక్ష పదవులు సీనియర్లకు దక్కేలా ఏఐసీసీ పెద్దలతో చర్చించనున్నారు రేవంత్.  తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 16వ తేదీకి వాయిదా, తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుపై సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన 

అలాగే ఎంతోకాలంగా పెండింగ్‌లో ఉన్న నామినేటెడ్ పోస్టుల భర్తీపై ఈసారి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. పోటీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో సామాజిక సమీకరణలు, సీనియారిటి ప్రాతిపదికన పోస్టులను భర్తీ చేసే అవకాశం ఉంది. నామినేటెడ్ పోస్టులకు సంబంధించి 25 మందితో కూడిన జాబితాను సీఎం సిద్ధం చేయగా దీనికి కాంగ్రెస్ అధిష్టానం అమోదముద్ర వేస్తే ప్రకటనే తరువాయి కానుంది. మొత్తంగా ఈ నెలాఖరు వరకు నామినేటెడ్ పోస్టులు, పార్టీ పదవులపై క్లారిటీ రానున్న నేపథ్యంలో ఆశావాహులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Group-2 Results Today: నేడు గ్రూప్‌-2 ఫలితాలు.. జనరల్‌ ర్యాంకింగ్‌ లిస్టును విడుదలచేయనున్న టీజీపీఎస్సీ.. ఇప్పటికే విడుదలైన ల్యాబ్‌ టెక్నీషియన్‌ పోస్టుల పరీక్ష ఫలితాలు

Telangana Group-1 Results Released: తెలంగాణ గ్రూప్ -1 పరీక్ష ఫలితాలు విడుదల, అభ్యర్థులు మార్కులను tspsc.gov.in ద్వారా చెక్ చేసుకోవచ్చు

Pranay 'Honour Killing' Case: ఆరేళ తర్వాత ప్రణయ్ హత్య కేసులో కీలక తీర్పు, ఒకరికి ఉరి, ఆరుగురికి జీవితఖైదు విధించిన నల్గొండ కోర్టు, 2018లో జరిగిన మిర్యాలగూడ పరువు హత్య కేసు వివరాలు ఇవే..

MLC Candidates: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ టికెట్ దాసోజు శ్రవణ్ కు.. కాంగ్రెస్ అభ్యర్ధులుగా అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నేడు నామినేషన్ల దాఖలుకు చివరి రోజు

Advertisement
Advertisement
Share Now
Advertisement