Duct-Taped Banana: ఈ అరటి పండు ధర రూ.85 లక్షలు, రెండు అరటి పండ్లను కొనుగోలు చేసిన అమెరికన్, ఇంతకీ ఏముంది ఈ పండులో..
అయితే ఇక్కడ ఓ అరటిపండును అమెరికన్ ఏకంగా రూ. 85 లక్షలకు కొనుగోలు చేశాడు. గోడకు అతికించిన అరటిపండు (Duct-Taped Banana, Banana) అంత ధరకు కొనుగోలు చేయడమా అని నోరెళ్లబెట్టకండి.. ఆర్ట్ మీద ప్రేమ ఉన్నవాళ్లు ఎంతైనా పెట్టి కొనుగోలు చేస్తారు మరి.
Mumbai, December 8:అరుదైన కళాఖండాలను కొందరు ఔత్సాహికులు కోట్లు వెచ్చించి మరీ కొనుగోలు చేస్తారనే విషయం చాలామందికి తెలిసే ఉండవచ్చు. అయితే ఇక్కడ ఓ అరటిపండును అమెరికన్ ఏకంగా రూ. 85 లక్షలకు కొనుగోలు చేశాడు. గోడకు అతికించిన అరటిపండు (Duct-Taped Banana, Banana) అంత ధరకు కొనుగోలు చేయడమా అని నోరెళ్లబెట్టకండి.. ఆర్ట్ మీద ప్రేమ ఉన్నవాళ్లు ఎంతైనా పెట్టి కొనుగోలు చేస్తారు మరి.
ఇటీవల మియామీ బీచ్(Art Basel Miami)లో ఏర్పాటు చేసిన కళా ప్రదర్శనలో ఈ అరటి పండు విశేషంగా ఆకట్టుకుంది. అరటి పండును టేపుతో గోడ(Taped To A Wall)కు అతికించడం ఒక ప్రత్యేకత కాగా.. దాని ధర రూ.85 లక్షలుగా ప్రకటించడం మరో విశేషం.
Art Basel Miami
ఇటలీకి చెందిన ప్రముఖ కళాకారుడు మౌరీజియో క్యాటెల్యాన్ (Italian artist Maurizio Cattelan) ఈ కళను సృష్టించాడు. దీనికి ‘కమెడియన్’ (Comedian)అని పేరు పెట్టాడు. అతను మొత్తం మూడు అరటి పండ్లను ఈ విధంగా ప్రదర్శించగా రెండు ఇప్పటికే అమ్ముడుపోయాయి. అరటి పండు, టేపు కావాలంటే మనకు సాధారణ దుకాణాల్లో కూడా దొరుకుతాయి. అలాంటిది ఇంత డబ్బులు పోసి దాన్ని కొనుగోలు చేయాలా? అనే అనుమానం రావచ్చు. కానీ, ఇలా ఆర్ట్ గ్యాలరీలో పేరొందిన కళాకారుల ఆర్ట్స్ మధ్య ఠివీగా ఉండే అరటి పండు దొరకదు కదా అని వాదిస్తున్నారు. పైగా దీనికి సర్టిఫికెట్ ద్వారా హక్కులు కూడా కల్పిస్తున్నారు.
గోడకు అంటించిన అరటిపండు
ఈ అరటి పండు చిత్రాన్ని ఆర్ట్ బాసెల్ మియామీ బీచ్ తమ ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పోస్టు చేసింది. ‘‘నిజమైన అరటిపండును గోడకు అతికించిన క్యాటెల్యాన్.. మొదట్లో అరటి పండు రూపంలో కళాఖండాలను తయారు చేయాలని భావించాడు. అతను ఏ ప్రాంతానికి వెళ్లినా.. తన హోటల్ గదిలో అరటి పండును గోడకు అతికించేవాడు. దాని స్ఫూర్తితో అతను కంచుతో అరటి పండు కళాఖండాన్ని తయారు చేశాడు. చివరి నిజమైన అరటి పండునే కళఖండంగా ప్రదర్శించాడు’’ అని ఆ పోస్టులో పేర్కొన్నారు.