Raj Babbar Gets Jail: నటుడు, కాంగ్రెస్ నేత రాజ్‌ బబ్బర్‌కు రెండేళ్ల జైలుశిక్ష, ఎన్నికల అధికారిపై దాడి కేసులో యూపీ కోర్టు తీర్పు, 1996 లో జరిగిన ఘటనపై ఇన్నాళ్లు సాగిన విచారణ

ప్రముఖ కాంగ్రెస్ నేత, నటుడు రాజ్‌ బబ్బర్ కు రెండేళ్ల జైలుశిక్ష విధించింది ఉత్తరప్రదేశ్ కోర్టు. 1996 కు సంబంధిన ఓ కేసుకు సంబంధించి రాజ్ బబ్బర్ ను దోషిగా తేల్చింది. ఎన్నికల అధికారిపై దాడికి పాల్పడ్డ కేసులో రాజ్ బబ్బర్‌కు(Raj Babbar) రెండేళ్ల జైలు శిక్ష విధించింది ఉత్తర ప్రదేశ్ కోర్టు(UP Court).

Lucknow, July 07: ప్రముఖ కాంగ్రెస్ నేత, నటుడు రాజ్‌ బబ్బర్ కు రెండేళ్ల జైలుశిక్ష విధించింది ఉత్తరప్రదేశ్ కోర్టు. 1996 కు సంబంధిన ఓ కేసుకు సంబంధించి రాజ్ బబ్బర్ ను దోషిగా తేల్చింది. ఎన్నికల అధికారిపై దాడికి పాల్పడ్డ కేసులో రాజ్ బబ్బర్‌కు(Raj Babbar) రెండేళ్ల జైలు శిక్ష విధించింది ఉత్తర ప్రదేశ్ కోర్టు(UP Court). కేసు వివరాల ప్రకారం.. 1996లో రాజ్ బబ్బర్ (Raj Babbar) ఉత్తర ప్రదేశ్‌లోని లక్నో నియోజకవర్గం నుంచి సమాజ్ వాదీ పార్టీ(Samajwadi party) తరఫున లోక్‌సభకు పోటీ చేశారు. అయితే, ఎన్నికల సందర్భంగా ఒక పోలింగ్ బూత్‌లో అక్కడ విధుల్లో ఉన్న అధికారికి, రాజ్ బబ్బర్‌కు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ వాగ్వాదం క్రమంగా పెరగడంతో ఎన్నికల అధికారిపై రాజ్ బబ్బర్‌ దాడికి పాల్పడ్డాడు. దీంతో 1996 మే 2న రాజ్ బబ్బర్‌పై వాజిర్ గంజ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. సెక్షన్ 143, 332, 353, 323, 504, 188 సెక్షన్ల కింద కేసు నమోదైంది.

అయితే అప్పట్లో ఆయనకు ఈ కేసులో బెయిల్ లభించింది. కాగా, ఈ కేసుపై ఇంతకాలంగా విచారణ సాగింది. ఈ కేసులో రాజ్ బబ్బర్‌(Raj Babbar) తప్పు చేశాడని కోర్టు గుర్తించింది. అతడికి రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ గురువారం తీర్పునిచ్చింది. అలాగే రూ.8,500 జరిమానా కూడా విధించింది.

UK PM Boris Johnson Resigns: ప్రధాన మంత్రి పదవికి బోరిస్ జాన్సన్ రాజీనామా, బ్రిటన్‌లో తలెత్తిన రాజకీయ సంక్షోభం, ప్రధానిపై నమ్మకం కోల్పోయామంటున్న నేతలు 

కాగా, తీర్పు సమయంలో రాజ్ బబ్బర్‌ కోర్టులోనే ఉన్నారు. ప్రస్తుతం ఆయన ఈ కేసులో బెయిల్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. దీనిపై లాయర్లు సంప్రదింపులు జరుపుతున్నారు.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Group-2 Results Today: నేడు గ్రూప్‌-2 ఫలితాలు.. జనరల్‌ ర్యాంకింగ్‌ లిస్టును విడుదలచేయనున్న టీజీపీఎస్సీ.. ఇప్పటికే విడుదలైన ల్యాబ్‌ టెక్నీషియన్‌ పోస్టుల పరీక్ష ఫలితాలు

Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్‌ పై విచారణ 12కి వాయిదా

Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్

Pranay 'Honour Killing' Case: ఆరేళ తర్వాత ప్రణయ్ హత్య కేసులో కీలక తీర్పు, ఒకరికి ఉరి, ఆరుగురికి జీవితఖైదు విధించిన నల్గొండ కోర్టు, 2018లో జరిగిన మిర్యాలగూడ పరువు హత్య కేసు వివరాలు ఇవే..

Advertisement
Advertisement
Share Now
Advertisement