Gautam Adani: రూ. 10 లక్షల కోట్లు కోల్పోయిన అదాని, సోమవారం ఒక్కరోజే రూ. 51,610 కోట్ల సంపద ఆవిరి, ప్రపంచ బిలియనీర్ల జాబితాలో 24వ స్థానానికి పడిపోయిన భారత బిలియనీర్

హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ ప్రకంపనలతో అదానీ గ్రూపు ఇన్వెస్టర్ల సంపద రోజు రోజుకు భారీగా క్షీణిస్తూ పోతోంది. జనవరి నుంచి అదానీ (Gautam Adani) గ్రూప్ మార్కెట్ విలువలో 10 లక్షల కోట్లు (10 ట్రిలియన్లు రూపాయలకు పైగా పతనమైంది. సోమవారం ఒక్కరోజే రూ. 51,610 కోట్ల సంపద ఆవిరైపోయింది.

Gautam Adani (File Image)

హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ ప్రకంపనలతో అదానీ గ్రూపు ఇన్వెస్టర్ల సంపద రోజు రోజుకు భారీగా క్షీణిస్తూ పోతోంది. జనవరి నుంచి అదానీ (Gautam Adani) గ్రూప్ మార్కెట్ విలువలో 10 లక్షల కోట్లు (10 ట్రిలియన్లు రూపాయలకు పైగా పతనమైంది. సోమవారం ఒక్కరోజే రూ. 51,610 కోట్ల సంపద ఆవిరైపోయింది. దీంతో ఒక్క రోజు పతనంతో గ్రూప్ మార్కెట్ విలువ 8.98 ట్రిలియన్‌ రూపాయిలకు పడిపోయింది.సంపద ఆవిరి కావడంతో అదానీ గ్రూప్ ఛైర్మన్, గౌతం అదానీ ప్రపంచ బిలియనీర్ల జాబితాలో 24వ స్థానానికి (Gautam Adani slips to 24th spot) దిగజారారు.

జమ్మూ & కాశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని పూర్తిగా అంతమొందించాం, ఇప్పుడు పర్యాటకులు అక్కడికి ధైర్యంగా వెళుతున్నారు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు

జనవరి 24న ప్రారంభమైన మెల్ట్‌డౌన్, గ్రూప్ మార్కెట్ క్యాప్ నుండి 10.2 ట్రిలియన్ రూపాయలు లేదా 53 శాతం తుడిచి పెట్టుకుపోయింది. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం ఫిబ్రవరి 14 నాటికి అదానీ నికర విలువ 52.4 బిలియన్‌ డాలర్లకు చేరుకుంది. ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం, నికర విలువ 53 బిలియన్‌ డాలర్లుగా ఉంది.ఇప్పటికే హిండెన్‌బర్గ్‌ ఆరోపణలను తిప్పి కొట్టిన అదానీ గ్రూప్ కొన్ని కంపెనీల స్వతంత్ర ఆడిట్‌ల కోసం అకౌంటెన్సీ సంస్థ గ్రాంట్ థోర్న్టన్‌ను నియమించినట్టు తెలుస్తోంది.

ప్రపంచ చరిత్రలోనే తొలిసారి బిగ్ డీల్, 290 బోయింగ్ విమానాల కొనుగోలుకు ఎయిరిండియా ఒప్పందం

ఇన్వెస్టర్లకు భరోసా కల్పించేందుకు అదానీ గ్రూప్‌ ప్రయత్నాలు చేస్తోంది. తమ వ్యాపార ప్రణాళికలకు అవసరమైన నిధులు పుష్కలంగా ఉన్నాయని తెలిపింది. వాటాదారులకు మంచి రాబడులే అందించగలమంటూ ధీమా వ్యక్తం చేసింది. వృద్ధి లక్ష్యాలు, పెట్టుబడులను కుదించుకుంటున్నట్లు వస్తున్న వార్తలను గ్రూప్‌ అధికార ప్రతినిధి ఖండించారు. ప్రస్తుత మార్కెట్‌ కుదుటపడిన తర్వాత గ్రూప్‌లోని ప్రతీ సంస్థ తన వ్యూహాల సమీక్ష చేపడుతుందని చెప్పారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement