ఎయిర్ షోలో టాటా గ్రూప్ తన విమానయాన సంస్థ ఎయిరిండియా కోసం ఫ్రాన్స్‌కు చెందిన విమానాల తయారీ సంస్థ ఎయిర్ బస్ నుంచి 290 విమానాల కొనుగోలుకు (Air India to Buy 290 Boeing Planes) డీల్ కుదుర్చుకుంది.ఈ విషయాన్ని టాటా సన్స్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ అధికారికంగా ప్రకటించారు.
విమానాల కొనుగోలు ఒప్పందం సందర్భంగా జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో భారత్ నుంచి ఎయిరిండియా (Air India) చైర్మన్ రతన్ టాటా, టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్, ప్రధాని మోదీ.. కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, జ్యోతిరాదిత్య సింధియాలు పాల్గొనగా.. ఫ్రాన్స్ నుంచి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ , ఎయిర్‌బస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ గుయిలౌమ్ ఫౌరీలు పాల్గొన్నారు.
ఈ డీల్‌లో 40 ఏ350 వైడ్ బాడీ లాంగ్ రేంజ్ ఎయిర్ క్రాఫ్ట్‌లు, 210 న్యారో బాడీ ఎయిర్ క్రాఫ్ట్‌ల కొనుగోలుకు రతన్ టాటా ఆర్డర్ ఇచ్చారు. అనంతరం మోదీ మాట్లాడుతూ..ఫ్రాన్స్‌తో ఒప్పందం చారిత్రాత్మకమని అన్నారు. ప్రపంచ చరిత్రలో ఎన్నడూ జరగని విధంగా విమానా కొనుగోళ్లు.. ఏవియేషన్ రంగంలో భారత్ మూడో అతిపెద్ద దేశంగా అవతరిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. వచ్చే 15 ఏళ్లలో భారత్‌కు 2,500 విమానాలు (Boeing aircrafts) అవసరం అవుతాయని గుర్తు చేశారు.
Here's ANI Tweet
Air India has selected 190 737 MAX, 20 787 Dreamliner and 10 777X airplanes. The agreement between Boeing & Air India includes options for 50 additional 737 MAXs and 20 787-9s aircrafts: Boeing
— ANI (@ANI) February 14, 2023
ఇక ఈ ఒప్పందం భారత్ - ఫ్రాన్స్ దేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాలలో ఒక మైలురాయిగా నిలుస్తుందని మాక్రాన్ కొనియాడారు. ‘టాటా - ఎయిర్ బస్ సంస్థల ఒప్పందం హిస్టారిక్ మూమెంట్. ఈ కొనుగోలు ఎయిర్ ఇండియా పునరుద్ధరణకు దోహహదపడుతుందని’ ఎయిర్‌బస్ సీఈవో గుయిలౌమ్ ఫౌరీ అభిప్రాయం వ్యక్తం చేశారు. కాగా, మరో ఏవియేషన్ సంస్థ బోయింగ్ నుంచి 250 విమానాల కొనుగోలుపై టాటా చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.
భారత్ కు చెందిన అతిపెద్ద విమానయాన సంస్థ ఎయిరిండియాతో బోయింగ్ ఒప్పందం కుదరడం పట్ల అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హర్షం వ్యక్తం చేశారు. ఇది చారిత్రాత్మక ఒప్పందం అని అభివర్ణించారు. ఈ ఒప్పందంతో అమెరికాలోని 44 రాష్ట్రాల్లో 10 లక్షల మంది అమెరికన్లు ఉపాధి పొందుతారని వివరించారు.
కాగా, ఈ డీల్ విలువ రూ.2.81 లక్షల కోట్లు. ఈ ఒప్పందంలో భాగంగా ఎయిరిండియా 190 బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలు, 20 బోయింగ్ 787 విమానాలు, 10 బోయింగ్ 777ఎక్స్ విమానాలు కొనుగోలు చేయనుంది. ఎయిరిండియా మరో 50 బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలు, 20 బోయింగ్ 787 విమానాలు కొనుగోలు చేసేందుకు కూడా ఆసక్తిగా ఉన్నట్టు తెలుస్తోంది.