Agniveer Death During Firing Practice: ఫైరింగ్ చేస్తుండగా గురి తప్పి అగ్ని వీరుల శరీరంలోకి దూసుకెళ్లిన తూటాలు, ఇద్దరు మృతి
మహారాష్ట్ర నాసిక్ (Nashik)లో ఇద్దరు అగ్నివీరులు (Agniveers) శిక్షణ సమయంలో ఫైరింగ్ (Firing Practice) చేస్తుండగా.. గురి తప్పి తూటాలు వారి మీదకు దూసుకెళ్లాయి. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఇద్దరు అగ్నివీరులు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు శుక్రవారం తెలిపారు
మహారాష్ట్ర నాసిక్ (Nashik)లో ఇద్దరు అగ్నివీరులు (Agniveers) శిక్షణ సమయంలో ఫైరింగ్ (Firing Practice) చేస్తుండగా.. గురి తప్పి తూటాలు వారి మీదకు దూసుకెళ్లాయి. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఇద్దరు అగ్నివీరులు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు శుక్రవారం తెలిపారు. నాసిక్ జిల్లాలోని ఆర్టిలరీ సెంటర్ (Artillery Centre)లో గురువారం మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకున్నట్లు సదరు అధికారులు తెలిపారు.
ఫైరింగ్ ప్రాక్టీస్ సమయంలో గురి తప్పి ఆ బుల్లెట్లు గోహిల్ విశ్వరాజ్ సింగ్ (20), సైఫత్ షిత్ (21) శరీరంలోకి దూసుకెళ్లినట్లు చెప్పారు. అగ్నివీర్ బృందం వారిని వెంటనే డియోలాలిలోని ఆసుపత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ ఇద్దరు అగ్నివీరులు తుది శ్వాస విడిచినట్లు వెల్లడించారు. ఈ ఘటనపై డియోలాలి క్యాంపు పోలీసులు ప్రమాదవశాత్తు మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పేర్కొన్నారు.