New Delhi, Oct 11: ఈ కేసును విచారణ చేస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ సౌరభ్‌పై ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసింది. ఈడీ ఆదేశాల మేరకు ఇంటర్‌పోల్ జారీ చేసిన రెడ్ కార్నర్ నోటీసుల ఆధారంగా దుబాయి (Dubai ) పోలీసులు సౌరభ్‌ను అరెస్ట్ చేశారు. తర్వలోనే భారత్‌కు తీసుకురానున్నట్లు తెలుస్తోంది.
ఈ కేసులో దాదాపు రూ.15 వేలకోట్ల కుంభకోణం జరిగినట్లు ఆరోపణలున్నాయి. దాదాపు 67 బెట్టింగ్ వెబ్‌సైట్లు, యాప్‌లను సృష్టించి క్రికెట్, ఫుట్‌బాల్ వంటి ఆటల్లో బెట్టింగ్/గ్యాంబ్లింగ్ నిర్వహించారు. ఇందులో సెలబ్రిటీలతో ప్రమోట్ చేయించారు. బాలీవుడ్ కమెడియన్ కపిల్ శర్మ, నటులు హుమా ఖురేషి, హీనా ఖాన్, సాహిల్ ఖాన్, సహా పలువురు నటులు ఈ కేసులో విచారణను ఎదుర్కొంటున్నారు.
బ్యాంకు అధికారుల పేరుతో బెదిరింపులు..సైబర్ నేరగాళ్ల పట్ల జాగ్రత్తగా ఉండండి...వీసీ సజ్జనార్ ట్వీట్
ఇక ఈ కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరైన రవి ఉప్పల్‌ను పోలీసులు గతేడాది దుబాయ్‌లో కస్టడీలోకి తీసుకున్నారు. విచారణలో నకిలీ పత్రాలతో దాదాపు 2,000 బోగస్ సిమ్‌లు, 1,700 బ్యాంకు ఖాతాలను సృష్టించినట్లు తేలింది. బెట్టింగ్‌ల ద్వారా వచ్చిన డబ్బును హవాలా, క్రిప్టో మార్గంలో విదేశాలకు తరలించినట్లు విచారణ అధికారులు గుర్తించారు.
ఈ కేసులో ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం భూపేష్ బఘేల్ (Bhupesh Baghel) కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మహదేవ్ యాప్ యజమానిగా చెబుతున్న సోని తాను 2021లో ఈ యాప్ ప్రారంభించానని, ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎంకు రూ. 508 కోట్లు చెల్లించానని, ఇందుకు తన వద్ద ఆధారాలున్నాయని ఆరోపించారు.