Andhra Pradesh Shocker: ఏపీలో సంచలనం.. కూతురిని వేధించాడని కువైట్ నుండి వచ్చి చంపేశాడు, తానే హత్యచేశానని కువైట్ నుండి వీడియో రిలీజ్
కూతురుని వేధించాడని కువైట్ నుంచి వచ్చి ఓ దివ్యాంగుడిని చంపేశాడు. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె మండలం కొత్తమంగంపేటలో ఘటన జరిగింది. గత శనివారం తెల్లవారుజామున గుట్ట ఆంజనేయులు అనే దివ్యాంగుడు దారుణ హత్యకు గురయ్యాడు. అనుమానాస్పద మృతి కేసుగా భావించి కేసు నమోదు చేశారు పోలీసులు.
Vij, Dec 12: ఏపీలో సంచలనం జరిగింది. కూతురుని వేధించాడని కువైట్ నుంచి వచ్చి ఓ దివ్యాంగుడిని చంపేశాడు. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె మండలం కొత్తమంగంపేటలో ఘటన జరిగింది. గత శనివారం తెల్లవారుజామున గుట్ట ఆంజనేయులు అనే దివ్యాంగుడు దారుణ హత్యకు గురయ్యాడు. అనుమానాస్పద మృతి కేసుగా భావించి కేసు నమోదు చేశారు పోలీసులు.
తన కూతురి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడంతో కువైట్ నుంచి వచ్చి తానే చంపి వెళ్లానని సోషల్ మీడియా ద్వారా వీడియో రిలీజ్ చేశాడు నిందితుడు ఆంజనేయప్రసాద్. జీవనోపాధి నిమిత్తం కువైట్ వెళ్లి.. తన కూతురిని ఊళ్లోనే ఉంటున్న చెల్లెలు లక్ష్మి, వెంకటరమణ దంపతుల వద్ద ఉంచి వెళ్లాడు నిందితుడు. తిరుమలలో భారీ వర్షం, అల్పపీడనం ప్రభావంతో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం..పాపవినాశనం, శ్రీవారి పాదాలకు వెళ్లే మార్గాలు తాత్కాలికంగా మూసివేత
Here's Video:
ఇటీవల వెంకటరమణ తండ్రి ఆంజనేయులు మనవరాలి వరసయ్యే ఆ బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు.ఈ విషయం తెలిసి కువైట్ నుండి వచ్చిన తండ్రి ఆంజనేయప్రసాద్....దివ్యాంగుడైన ఆంజనేయులను హత్య చేశాడు. స్థానికంగా ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.
Here's Video: