Franco Mulakkal: గట్టిగా వాటేసుకుని బలవంతంగా ముద్దు పెట్టాడు, వీడియో కాల్‌లో ఆ మాటలే మాట్లాడేవాడు, కేరళ బిషప్ ఫ్రాంకో ములక్కల్‌పై మరో నన్ సంచలన వ్యాఖ్యలు
క్రైస్తవ సన్యాసిని(నన్)పై (Kerala Nun) లైంగిక వేధింపులు, అత్యాచారం ఆరోపణల కేసులో అరెస్ట్ అయిన కేరళ బిషప్(మత బోధకుడు) ఫ్రాంకో ములక్కల్‌పై (Franco Mulakkal) ఉచ్చు మరింతగా బిగిస్తోంది. బిషప్ బారిన పడ్డ బాధితులు ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు. తాజాగా మరో నన్ ఆయనపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బిషప్ ములక్కల్ తనపైనా లైంగిక దాడి చేసినట్లు మరో నన్ తెలిపింది.
Thiruvananthapuram, Febuary 22: క్రైస్తవ సన్యాసిని(నన్)పై (Kerala Nun) లైంగిక వేధింపులు, అత్యాచారం ఆరోపణల కేసులో అరెస్ట్ అయిన కేరళ బిషప్(మత బోధకుడు) ఫ్రాంకో ములక్కల్‌పై (Franco Mulakkal) ఉచ్చు మరింతగా బిగిస్తోంది. బిషప్ బారిన పడ్డ బాధితులు ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు. తాజాగా మరో నన్ ఆయనపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బిషప్ ములక్కల్ తనపైనా లైంగిక దాడి చేసినట్లు మరో నన్ తెలిపింది.
రేప్ జరగలేదు కదా..జరిగాక రా..చూద్దాం
బలవంతంగా ముద్దులు పెట్టాడని, లైంగికంగా వేధించాడని ఆరోపించింది. నన్ పై అత్యాచార కేసులో (Sexual assault) 14వ సాక్షిగా ఉన్న మరో నన్(35).. ఈ మేరకు వాంగూల్మం ఇచ్చింది. కాగా ఈ బిషప్ నన్(క్రైస్తవ సన్యాసిని)పై పలుమార్లు లైంగికదాడి పాల్పడిన ఆరోపణల కేసులో గతేడాది అరెస్టు అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో శుక్రవారం బిషప్ కేసు పిటిషన్ విచారణ నేపథ్యంలో మరో బాధితురాలు తన గోడును వెళ్లబోసుకుంది.
రాహుల్ రేప్ ఇన్ ఇండియా వ్యాఖ్యలపై దద్దరిల్లిన పార్లమెంట్
వాట్సప్‌లో కాల్‌లో అసభ్యపదజాలంతో తనను లైంగిక వేధింపులకు గురిచేశాడని బాధితురాలు తెలిపారు. అంతేగాక బలవంతంగా ముద్దులు పెట్టాడని కోర్టుకు విన్నవించారు. ఈ విషయాల గురించి బాధితురాలు మాట్లాడుతూ ‘నేను బిషప్‌ను (Bishop Franco Mulakkal) మొదటి సారిగా 2015 బిహార్‌లో కలిశాను.
కాన్వెంట్‌కు సంబంధించిన విషయాలను గురించి తరచూ ఆయనతో వాట్సప్ వీడియో కాల్, ఫోన్ కాల్స్ మాట్లాడేదాన్ని. వాట్సప్‌లో చాటింగ్ కూడా చేసేదాన్ని. ఇలా 2015 నుంచి 2017 వరకు మాట్లాడాను. మొదట్లో బాగానే మాట్లాడేవాడు. ఇక 2015 ఏడాది చివరిలో ఆయన మాటల్లో క్రమంగా తేడాను గమనించాను. నన్‌ని అని కూడా చూడకుండా అసభ్యపదజాలంతో మాట్లాడూతూ వేధించడం ప్రారంభించాడు.
లిఫ్ట్ పేరుతో బాలికపై గ్యాంగ్ రేప్
ఈ నేపథ్యంలో కొన్ని కారణాలు వల్ల నేను కేరళకు వెళ్లాల్సివచ్చింది. ఈ క్రమంలో ఓ రోజు రాత్రి ఒంటిగంట ప్రాంతంలో బిషప్ ములక్కల్ నన్ను తన రూంకు పిలిచి బిహార్ నుంచి కేరళకు రావడానికి గల కారణాలపై ఆరా తీశాడు. నేను ఆయనకు వివరించాను.
ఇలా రెండుగంటల పాటు మాట్లాడుకున్నాక నేను వెళ్లిపోతున్న క్రమంలో నన్ను వెనుక నుంచి వచ్చి గట్టిగా కౌలిగించుకుని బలవంతంగా ముద్దులు పెట్టాడు’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక వాట్సప్ వీడియో కాల్స్‌లో తన శరీర భాగాలు, నా దేహంలోని భాగాల గురించి మాట్లాడాడని భాధితురాలు వాగ్మూలంలో పేర్కొన్నారు.
టీవీలు, ఫోన్‌ల వల్లే రేప్‌లు జరుగుతున్నాయి
సెక్స్ గురించి మాట్లాడటం నాకు ఇష్టం లేకపోయినా బిషప్ భయంతో.. చర్చి నుంచి గెంటేస్తారనే భయంతో.. మౌనంగా ఉండిపోయానని, బిషప్ తో వాట్సాప్ లో చాటింగ్ చేయాల్సి వచ్చిందని నన్న వాపోయింది. ఈ విషయాన్ని బయటికి చెబితే బిషప్ తనకు హాని చేస్తాడని, నన్ గా తొలగిస్తాడని భయపడ్డానని, అందుకే అప్పట్లో చెప్పలేదని వివరించింది.
కాగా ములక్కల్.. తనపై పలుమార్లు అత్యాచారం చేశారని కొట్టాయం కాన్వెంటుకు చెందిన ఓ నన్ ఆరోపించడంతో రెండేళ్ల కింద కేసు నమోదైంది. ఆమె ఫిర్యాదు మేరకు బిషప్‌ను పోలీసులు అరెస్ట్ చేసి 2019లో చార్జిషీటు దాఖలు చేశారు. ఈ కేసుకి సంబందించి దర్యాఫ్తు జరుగుతోంది.తాజాగా మరో నన్ బిషప్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడం కలకలం రేపుతోంది.
(The above story first appeared on LatestLY on Feb 22, 2020 12:04 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

