Tirupati, December 8: దిశ నిందితుల ఎన్‌కౌంటర్ (Hyderabad Encounter) తర్వాత కూడా మృగాళ్లలో మార్పు రావడం లేదు. రేపిస్టులను కఠినంగా శిక్షించాలని, బహిరంగంగా ఉరి తీయాలని దేశవ్యాప్తంగా డిమాండ్లు వినిపిస్తున్నప్పటికీ వారిలో ఎటువంటి చలనం కలగడం లేదు. దిశ నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేసినా కూడా కామాంధులు రెచ్చిపోతూనే ఉన్నారు.
తాజాగా చిత్తూరు జిల్లా(Chittoor district)లో మైనర్ బాలిక(Minor girl)పై ఇద్దరు కామాంధులు అత్యాచారానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. రూరల్ మండలం ముళ్లపూడి గ్రామానికి చెందిన ఓ బాలికను లిఫ్ట్ ఇస్తామంటూ బైక్ ఎక్కించుకున్న యువకులు ఆమెను పొదల్లోకి తీసుకెళ్లి బెదిరించి లైంగిక దాడికి పాల్పడ్డారు. తనను వదిలేయాలని బాధితురాలు వేడుకున్నా ఆ మృగాళ్లు కనికరించలేదు.
ఈ ఘటనపై తిరుచానూరు పోలీసుల విచారణ చేపట్టారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తీసుకెళ్లారు. బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఇద్దరు యువకులను కఠినంగా శిక్షించాలని స్థానికులు కోరుతున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ''పద్మావతిపురం దగ్గర తిరుచానూరు(Thiruchanuru) వైపు వెళ్తున్న ఓ బైక్‌ను బాలిక లిఫ్ట్ కావాలని అడిగింది. తనను తిరుచానూరులో విడిచిపెట్టాలని కోరింది. అయితే, ఆ యువకుడు తిరుచానూరులో బైక్‌ను ఆపకుండా ముళ్లపూడి గేట్ వరకు తీసుకెళ్లాడు. కారణం అడిగితే బైక్‌లో పెట్రోల్ అయిపోయిందని చెప్పాడు. బైకు పక్కనే ఆపేసి తన మిత్రుడికి ఫోన్ చేసి పిలిపించుకున్నాడు.
ఆ తర్వాత పక్కనే ఉన్న పొదల్లోకి తీసుకెళ్లి ఇద్దరూ బాలికిపై అత్యాచారానికి పాల్పడ్డారు. బాధిత బాలిక ఫిర్యాదుతో నిందితులు వెంకటేశ్, రాజమోహన్ నాయక్(Venkatesh and Rajamohan Nayak)ను అరెస్ట్ చేశామని డీఎస్పీ మురళీకృష్ణ తెలిపారు.కాగా నిందితుల్లో ఒకరిపై గతంలో కేసులు ఉన్నాయి.నిందితులపై పోక్సో చట్టం కింద కేసు పెట్టామని, చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.