Rahul Gandhi | File Image | (Photo Credits: PTI)

New Delhi, December 13: భారతదేశం(India)లో జరుగుతున్న రేప్‌లపై కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ(Rahul Gandhi) చేసిన వ్యాఖ్యలపై లోక్ సభ(Lok Sabha)లో దుమారం చెలరేగింది. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన రేప్ ఇన్ ఇండియా(Rape In India)వ్యాఖ్యలు దేశాన్ని అవమానపరిచే విధంగా ఉన్నాయని వెంటనే రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలంటూ బీజేపీ ఎంపీలు డిమాండ్ చేశారు.

భారత మహిళ రేప్ చేయబడాలి అని చరిత్రలో మొదటిసారిగా ఓ నాయకుడు గట్టిగా పిలుపునిచ్చాడని,ఇదేనా దేశ ప్రజలకు రాహుల్ గాంధీ ఇచ్చే మెసేజ్ అంటూ కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ(Smriti Irani) తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.

ఇతర పార్టీలకు చెందిన మహిళా ఎంపీలు కూడా రాహుల్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో పాటు అటు రాష్ట్రంలోనూ ఇదే విషయమై గందరగోళం నెలకొంది. రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని అంటూ కొందరు ఎంపీలు నినాదాలు చేశారు. దీంతో వెంకయ్య నాయుడు స్పందిస్తూ సభలో లేని వ్యక్తి పేరును చెప్పడం సరికాదు. సభకు ఆటంకం కలిగించవద్దంటూ ఎంపీలకు సూచించారు. అయినప్పటికీ సభ్యులు ఆందోళన చేయడంతో సభను వాయిదా వేశారు.

 

అయితే ఈ వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ స్పందించారు. బీజేపీ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్న క్షమాపణ గురించి ఆయన అది జరగదని చెప్పారు. నేను క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని అలా ఎందుకు చెప్పాల్సి వచ్చిందో క్లారిఫై వివరణ ఇస్తున్నానని తెలిపారు. "నేను క్షమాపణ చెప్పను ... నేను చెప్పినదానిని స్పష్టత ఇస్తున్నా.. ప్రధాని (PM Modi)ఎప్పుడూ మేక్ ఇన్ ఇండియా(Make In India) గురించి మాట్లాడుతుంటారని అయితే మేము రోజూ పొద్దున న్యూస్ పేపర్లు తిరగేస్తే దానికి బదులు అత్యాచారాల వార్తలు కనిపిస్తున్నాయిని అన్నారు.

ANI Tweet

వీటికోసమే అందరూ రోజు పేపర్లు తెరవాలా అని ప్రశ్నించారు. అందుకే ఆ విధంగా అన్నానని వివరణ ఇచ్చారు. ఈ ప్రధాని మోడీ ఆధ్వర్యంలోని ఈ ప్రభుత్వం పౌరసత్వ చట్టంపై ఈశాన్యంలో జరిగిన నిరసనల నుండి దృష్టిని మళ్లించడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు.

ఇదిలా ఉంటే రాహుల్ వ్యాఖ్యలను డీఎంకే,కాంగ్రెస్ సమర్థించాయి. రాహుల్ వ్యాఖ్యల్లో తప్పేమీ లేదని డీఎంకే ఎంపీ కనిమోళి తెలిపారు. ప్రధాని మేక్ ఇన్ ఇండియా అని చెప్పారని,దాన్ని మేము గౌరవించామని,అయితే ఇప్పుడు దేశంలో జరుగుతున్నది ఏంటీ అని కనిమోళి ప్రశ్నించారు. అదే రాహుల్ చెప్పాలనుకున్నాడని అన్నారు.