Mardaani 2 Trailer: భయంకరమైన రేప్ సీన్లు, మర్దానీ 2 ట్రైలర్ విడుదల, ప్రధాన పాత్ర పోషించిన రాణీ ముఖర్జీ, డిసెంబర్ 13న సినిమా విడుదల
mardaani-2-rani-mukerji-power-packed-trailer (Photo Credits: YouTube/Screengrab/ YRF)

November 15: రాణీ ముఖర్జీ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా.. ‘మర్దానీ 2’(Mardaani 2 Trailer)కు సంబంధించిన ట్రైలర్ విడుదలయింది. 2014లో వచ్చిన ‘మర్దానీ’కిది (Mardaani ) సీక్వెల్‌గా వస్తోంది. వాస్తవ సంఘటనల ఆధారంగా గోపీ పుత్రన్ దర్శకత్వంలో, యశ్ రాజ్ ఫిలింస్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నారు. మహిళల అక్రమ రవాణా నేపథ్యంలో ‘మర్దానీ’ రూపొందగా, కిడ్నాపింగ్, రేప్ వంటి ఘటనలతో ‘మర్దానీ 2’ తెరకెక్కుతోంది.

ఇండియాలో ప్రతీ ఏటా 18 సంవత్సరాలలోపు కుర్రాళ్ల కారణంగా 2 వేల రేప్ కేసులు నమోదవుతున్నాయని చెబుతూ ట్రైలర్ స్టార్ట్ అవుతుంది. ఈ ట్రైలర్ ఆసక్తి కరంగా ఉండడమే కాక సినిమాపై అంచనాలు పెంచింది. ఇందులో రాణీ ముఖర్జీ (Rani mukerji) శివానీ శివాజీ రాయ్ అనే పవర్ ఫుల్ పోలీస్ అధికారిణిగా కనిపిస్తుంది. డిసెంబర్ 13న ‘మర్దానీ 2’ విడుదల కానుంది.

సినిమా ట్రైలర్ విషయానికి వస్తే.. ఓ అమ్మాయి రోడ్డుపై నడుచుకుంటూ వెళుతుండగా అటుగా వెళుతున్న కారును ఆపి లిఫ్ట్ అడుగుతుంది. అతను లిఫ్ట్ ఇచ్చినట్లే ఇచ్చి ఆ అమ్మాయిని దారుణంగా రేప్ చేసి బాడీని ఓ నదిలో పడేస్తాడు.

ఈ కేసును డీల్ చేయడానికి శివానీ శివాజీ రాయ్ (రాణీ ముఖర్జీ)ని నియమిస్తారు. మరి ఆ రాక్షసుడిని రాణీ ముఖర్జీ పట్టుకోగలిగిందా లేదా అన్నది చూడాలంటే సినిమా విడుదల వరకు ఆగాల్సిందే.

వయసు మీద పడుతున్నప్పటికీ రాణీముఖర్జీలో ఉన్న ఆ ఫైర్ ఇంకా అలాగే ఉందని ట్రైలర్ చూస్తే ఇట్టే తెలిసిపోతుంది. ఇందులో విక్రమ్ సింగ్ చౌహాన్, శ్రుతి బాప్నా కీలక పాత్రలు పోషిస్తున్నారు.