Another Suicide Case in Kota: కోటాలో ఆగని విద్యార్థుల ఆత్మహత్యలు, తాజాగా మరో విద్యార్థి సూసైడ్, ఈ ఏడాది ఇది నాలుగో మరణం

రాజస్థాన్‌లోని కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలు ఆగడం లేదు. ఐఐటీ జేఈఈకి సిద్ధమవుతోన్న జార్ఖండ్ కు చెందిన మరో విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. దేశవ్యాప్తంగా విద్యార్థులు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే ఎడ్యుకేషన్‌ హబ్‌లో ఇలాంటి ఘటనలకు చెక్‌ పెట్టేందుకు విశ్వప్రయత్నాలు చేసినప్పటికీ ఈ ఏడాది విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం ఇది నాలుగోది.

Representative image. (Photo Credits: Unsplash)

Kota, Feb 13: రాజస్థాన్‌లోని కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలు ఆగడం లేదు. ఐఐటీ జేఈఈకి సిద్ధమవుతోన్న జార్ఖండ్ కు చెందిన మరో విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. దేశవ్యాప్తంగా విద్యార్థులు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే ఎడ్యుకేషన్‌ హబ్‌లో ఇలాంటి ఘటనలకు చెక్‌ పెట్టేందుకు విశ్వప్రయత్నాలు చేసినప్పటికీ ఈ ఏడాది విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం ఇది నాలుగోది.

కోట విద్యార్థుల ఆత్మహత్యలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు, తల్లిదండ్రుల ఒత్తిడి వల్లే వారు ఈ నిర్ణయం తీసుకుంటున్నారని, కోచింగ్ సెంటర్లను తప్పుపట్టలేమని స్పష్టం

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఝార్ఖండ్‌కు చెందిన శుభ్‌ చౌధరీ.. గత రెండేళ్లుగా ఐఐటీ జేఈఈకి సిద్ధమవుతున్నాడు. నిన్న జేఈఈ మెయిన్‌ ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ పరీక్షలో తన అంచనాకు తగ్గట్టుగా మార్కులు సాధించలేకపోయాడు. ఫలితాలు చూసుకున్న తర్వాత గదికి వెళ్లాడు. ఈ రోజు ఉదయం సీలింగ్‌కు ఉరేసుకొని వేలాడుతున్న అతడి మృతదేహాన్ని గుర్తించారు. సూసైడ్ నోట్ లేదా మరేదైనా క్లూ కోసం పోలీసులు అతని గదిలో వెతుకుతున్నారు. యువకుడి కుటుంబీకులకు సమాచారం అందించారు. వారు కోటకు చేరుకున్న తర్వాత శవపరీక్ష నిర్వహిస్తారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement