Assam Shocker: మత్తు మందు ఇచ్చి మైనర్ బాలికపై దారుణంగా అత్యాచారం, 5 ఏళ్ళ నుండి కొనసాగుతున్న కామాంధుడి దాడి, అస్సాంలో దారుణ ఘటన వెలుగులోకి..

తిన్సుకియాకు చెందిన మైన‌ర్ బాలిక‌ను ప‌నిలో పెట్టుకున్న య‌జ‌మాని ఐదేండ్లుగా ఆమెతో వెట్టిచాకిరి చేయించ‌డంతో పాటు లైంగిక దాడికి పాల్ప‌డ్డాడు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ (Man arrested for raping minor girl) చేశారు.

Rape | Representational Image (Photo Credits: Pixabay)

Tinsukia, Mar 10: అసోం రాజధాని గువాహటిలోలో దారుణ ఘ‌ట‌న వెలుగుచూసింది. తిన్సుకియాకు చెందిన మైన‌ర్ బాలిక‌ను ప‌నిలో పెట్టుకున్న య‌జ‌మాని ఐదేండ్లుగా ఆమెతో వెట్టిచాకిరి చేయించ‌డంతో పాటు లైంగిక దాడికి పాల్ప‌డ్డాడు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ (Man arrested for raping minor girl) చేశారు. ఈ కేసుకు సంబంధించి మ‌రో ఇద్ద‌రిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాలిక‌ను స్కూల్ నుంచి బ‌ల‌వంతంగా మాన్పించిన త‌ల్లి 2017 నుంచి ఇంటిప‌నులు చ‌క్క‌బెట్టే ప‌నిలో కుదిర్చింది.

బెల్టోలాలోని బ్యూటీ సింగ్ ఇంట్లో ప‌నిచేస్తుండ‌గా ఆమె సోద‌రుడు జ‌స్బీర్ సింగ్‌, మాస్ట‌ర్‌, బ్యూటీ సింగ్ కుమారుడు స‌న్నీ సింగ్‌లు బాలిక‌ను (Raping minor girl, Assam) వేధిస్తుండేవారు. బాలిక‌కు హామీ ఇచ్చిన వేత‌నాన్ని చెల్లించ‌కుండా అద‌న‌పు ప‌ని చేయిస్తూ వేధించేవారు. ఆపై బ‌ర్మొటొరియాలోని స‌న్నీ సింగ్ అపార్ట్‌మెంట్‌లో ప‌ని చేసేందుకు తీసుకువెళ్లారు. అక్క‌డ బాలిక‌ను తీవ్రంగా కొట్ట‌డం, స‌న్నీ కుక్క‌తో బ‌ల‌వంతంగా క‌రిపించ‌డం వంటి చిత్ర‌హింస‌ల‌కు పాల్ప‌డ్డారు. 2021లో బ్యూటీ సింగ్‌, ఆమె కుమారుడు టిన్సుకియా వెళుతూ బాలిక‌ను జ‌స్బీర్ సింగ్ అనే వ్య‌క్తి ఇంట్లో విడిచివెళ్లారు.

అల్లరి పిల్ల ఫేస్‌బుక్‌ ఐడీతో జాగ్రత్త, నగ్నంగా వీడియో కాల్స్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తున్న యువతి, ఎనిమిది మంది మధ్యవర్తులను అరెస్ట్ చేసిన చిత్తూరు పోలీసులు

ఈ క్ర‌మంలో జ‌స్బీర్ బాలిక‌కు మ‌త్తుమందు క‌లిపిన డ్రింక్ ఇచ్చి ఆమెపై లైంగిక దాడికి పాల్ప‌డ్డాడు. ఈ విష‌యం ఎవ‌రికైనా చెబితే తీవ్ర ప‌రిణామాలు ఎదుర‌వుతాయ‌ని బాలిక‌ను హెచ్చ‌రించాడు. అంతేకాక రూ.200 ఇస్తానని తెలిపాడు. ధైర్యం కూడ‌దీసుకున్న బాలిక నిందితుల చెర నుంచి బ‌య‌ట‌ప‌డి మార్చి 2న అసోం డీజీపీని సాయం కోరుతూ ఆశ్ర‌యించింది. మార్చి 7న బాలిక ఫిర్యాదు ఆధారంగా కేసు న‌మోదు చేసిన పోలీసులు జ‌స్బీర్‌ను అరెస్ట్ చేశారు. బ్యూటీ సింగ్ ఆమె కుమారుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.