Astrology: నవంబర్ 15 నుండి శని గ్రహం కుంభరాశిలోకి ప్రవేశం, శనిదేవుని రాశుల అనుగ్రహం వల్ల ఈ మూడు వారికి అదృష్టం..

అంతేకాకుండా నవంబర్ 15వ తేదీన కార్తీక పౌర్ణమి రోజున శనిగ్రహం నేరుగా కుంభరాశిలోకి వెళుతుంది.

astrology

నవంబర్ 15న శని గ్రహం కుంభరాశిలోకి ప్రవేశం, దీని కారణంగా మూడు రాశుల వారికి అదృష్టం. అంతేకాకుండా నవంబర్ 15వ తేదీన కార్తీక పౌర్ణమి రోజున శనిగ్రహం నేరుగా కుంభరాశిలోకి వెళుతుంది. శని సంచార సమయంలో శని దేవుడు ఈ మూడు రాశుల అనుగ్రహాన్ని ఇస్తాడు ఆ మూడు రాశుల ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

కన్యారాశి- కన్య రాశి వారికి శని సంచారం కారణంగా శుభ ఫలితాలను ఇస్తుంది. నవంబర్ 15 నుండి వీరి జీవితంలో సానుకూల ప్రభావాలు ఉంటాయి. అన్ని శుభ ఫలితాలు ఉంటాయి. వ్యాపారంలో పురోగతి ఉంటుంది. వ్యాపార విస్తరణ కోసం విదేశాల్లో పెట్టుబడులు పెడతారు. ఇది మీకు అనేక లాభాలను తీసుకువస్తుంది. ఉద్యోగం చేసే వారికి ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీని ద్వారా మీ జీతం రెట్టింపు అవుతుంది. విదేశాలకు వెళ్లాలనుకునే వారి కర్రల నెరవేరుతుంది. శని దేవుడు మీ పట్ల దయ చూపుతున్నాడు. కాబట్టి మీరు అనేక శుభ ఫలితాలను పొందుతారు.

Vastu Tips: బెడ్రూంలో పొరపాటును కూడా ఈ వస్తువులను ఉంచకండి, 

వృశ్చిక రాశి- వృశ్చిక రాశి వారికి శనిదేవుని ప్రత్యేక దయ ఉంటుంది. శనిదేవుని కలయిక వల్ల వీరి జీవితంలో అనేక శుభ ఫలితాలు వస్తాయి. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. వ్యాపార విస్తరణ కోసం మీరు చేసే పర్యటనలు మీకు లాభాలను తీసుకువస్తాయి. ఆరోగ్యపరంగా కూడా మీకు రాబోయే కాలంలో అనుకూలంగా ఉంటుంది. సంపద పెరుగుతుంది. మీకు సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. రావాల్సిన మొండిబకాయల నుండి డబ్బు లభిస్తుంది. నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు.

తులారాశి- తుల రాశి వారికి శనిదేవుని అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. వీరు చేసే ప్రతి పనిలో కూడా ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది. ఉద్యోగానికి సంబంధించిన శుభవార్తలు వింటారు. పిల్లలు పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులు అవుతారు. పిల్లల నుంచి ఒత్తిడి దూరం అవుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ప్రేమ వివాహాలకు కుటుంబ సభ్యుల నుండి మద్దతు లభిస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఏకాంతంగా గడుపుతారు. విహార యాత్రలకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారంలో పెట్టుబడులు మీకు లాభాలను తీసుకువస్తాయి. రియల్ ఎస్టేట్ రంగంలో వారికి ఆర్నెక లాభాలు ఉన్నాయి.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.