Bengaluru Shocker: సగం ముక్క సిగిరెట్ కోసం స్నేహితుడ్ని పొడిచి చంపిన వ్యక్తి, హత్యకు దారితీసిన సిగిరెట్ షేరింగ్‌పై ఇద్దరి మధ్య వాగ్వాదం
సిగరెట్ షేరింగ్ (Sharing Cigarette)విషయంలో వివాదం తలెత్తింది. ఇది గొడవకు దారి తీసింది. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. అయితే, మధ్యలో మంజునాథ్ అనే వ్యక్తి జోక్యం చేసుకుని వివాదాన్ని సద్దుమణిగేలా చేశాడు. తర్వాత మరుసటి రోజు గురువారం సాయంత్రం ఈ గొడవ గురించి గణేష్ మళ్లీ ప్రస్తావించాడు.
Bengaluru, March 24: సిగరెట్ షేరింగ్ విషయంలో (Sharing Cigarette) ఇద్దరి మధ్య తలెత్తిన గొడవ ఒకరి హత్యకు దారితీసింది. ఈ ఘటన బెంగళూరులోని ఉప్పర్‌పేటలో గురువారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కలబుర్గి జిల్లాకు చెందిన మల్లినాథ్ బిరాదర్ అనే వ్యక్తి స్థానిక మెజెస్టిక్ ప్రాంతంలోని ఒక హోటల్‌లో పని చేస్తున్నాడు. బుధవారం సాయంత్రం అతడితోపాటు పని చేసే గణేష్ అనే వ్యక్తితో సిగరెట్ షేరింగ్ (Sharing Cigarette)విషయంలో వివాదం తలెత్తింది. ఇది గొడవకు దారి తీసింది. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. అయితే, మధ్యలో మంజునాథ్ అనే వ్యక్తి జోక్యం చేసుకుని వివాదాన్ని సద్దుమణిగేలా చేశాడు.
తర్వాత మరుసటి రోజు గురువారం సాయంత్రం ఈ గొడవ గురించి గణేష్ మళ్లీ ప్రస్తావించాడు. దీంతో మళ్లీ గణేష్, మల్లినాథ్ మధ్య గొడవ మొదలైంది. మంజునాథ్‌తో కూడా గొడవ తలెత్తింది. ఈ క్రమంలో కోపం తెచ్చుకున్న గణేష్, తన దగ్గరున్న కత్తితో దాడి చేశాడు. మల్లినాథ్‌ను కత్తితో అనేక పోట్లు (Man Stabbed to Death) పొడిచాడు. ఈ గొడవలో గణేష్, మంజునాథ్ కూడా తీవ్రంగా గాయపడ్డారు. తీవ్ర రక్తస్రావంతో ఉన్న మల్లినాథ్‌ను అక్కడున్న వాళ్లు వెంటనే ఆస్పత్రికి తరలించారు.
అయితే, అక్కడ చికిత్స పొందుతూ మల్లినాథ్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనలో గాయపడ్డ ప్రధాన నిందితుడు గణేష్, మంజునాథ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. నిందితుడిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.