ఝార్ఖండ్‌లోని ధన్‌బాద్ సిటీలో ఓ ప్రైవేట్ ఏజెన్సీకి చెందిన చిన్న విమానం కంట్రోల్ తప్పి ఇంటిపైన కూలిపోయింది. ఈ ప్రమాదంలో పైలట్ కు, అందులో ప్రయాణిస్తున్న బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి.సిటీ టూర్ లో భాగంగా బర్వాడ్ద ఏర్ స్ట్రిప్ నుంచి గ్లైడర్ విమానం బయల్దేరింది. అరకిలోమీటర్ వెళ్లగానే విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది, ఆపై కంట్రోల్ తప్పి ఓ ఇంటి పిల్లర్ ను ఢీకొట్టింది. దీంతో విమానం ముక్కలు ముక్కలైంది. విమాన ప్రమాదం గురించి స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. బాధితులను ఆసుపత్రికి తరలించారు.ప్రమాదానికి కారణం సాంకేతిక సమస్యేనని అధికారులు ప్రాథమికంగా తేల్చారు. అయితే, విచారణ పూర్తయితే కానీ ప్రమాదానికి అసలు కారణమేంటనేది తెలియదని చెప్పారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)