తెలంగాణలో ఏప్రిల్ 3వ తేదీ నుంచి 13వ తేదీ వరకు పదవ తరగతి పరీక్షలు జరగనున్నాయి. కాగా నేడు టెన్త్ క్లాస్ పరీక్షల హాల్ టికెట్లు విడుదల చేశారు. తెలంగాణ వ్యాప్తంగా 4,94,616 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయనున్నారు. విద్యార్థులు తమ హాల్ టికెట్లను ఎస్ఎస్ సీ వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. జిల్లా, పాఠశాల పేరు, పుట్టినతేదీ వివరాలు ఎంటర్ చేసి హాల్ టికెట్లు పొందవచ్చు. కాగా, తెలంగాణలో 11 పేపర్లను కుదించి 6 పేపర్లతో పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి.

Here's Update

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)