Bengaluru Shocker: బెంగుళూరులో దారుణం, ప్రియుడి ఫోన్‌లో 1300 న్యూడ్ ఫోటోలు చూసి షాకైన ప్రియురాలు, చివరకు ఏం జరిగిందంటే..

కర్ణాటక రాజధాని బెంగళూరులో దారుణ ఘటన చోటు చేసుకుంది. తనతో ప్రేమాయణం సాగిస్తున్న సహోద్యోగి ఫోన్ గ్యాలరీని తనిఖీ చేసిన ఓ మహిళ తన జీవితంలో షాక్‌ను చవిచూసింది. ప్రియుడైన సహోద్యోగి మొబైల్‌ ఫోన్‌లో 13,000కు పైగా మహిళల నగ్న ఫొటోలు ఉండటాన్ని ప్రియురాలు చూసింది.

Arrest | Representational Image (Photo Credits: @funclickearn/Twitter)

Bengaluru, Nov 29: కర్ణాటక రాజధాని బెంగళూరులో దారుణ ఘటన చోటు చేసుకుంది. తనతో ప్రేమాయణం సాగిస్తున్న సహోద్యోగి ఫోన్ గ్యాలరీని తనిఖీ చేసిన ఓ మహిళ తన జీవితంలో షాక్‌ను చవిచూసింది. ప్రియుడైన సహోద్యోగి మొబైల్‌ ఫోన్‌లో 13,000కు పైగా మహిళల నగ్న ఫొటోలు ఉండటాన్ని ప్రియురాలు చూసింది. (Woman Shocked) అందులో తనతోపాటు మరి కొందరు అమ్మాయిల నగ్న ఫొటోలు ఉండటంతో ఆమె షాక్‌ అయ్యింది.

దీంతో షాక్ తిన్న పని చేసే సంస్థకు ఈ విషయం చెప్పింది. దీంతో ఆ సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 22 ఏళ్ల యువతి ఒక బీపీవో సంస్థలో పని చేస్తున్నది. సహోద్యోగి అయిన 23 ఏళ్ల ఆదిత్య సంతోష్, ఆమెకు మధ్య సన్నిహిత సంబంధం ఉంది. వారిద్దరూ సన్నిహితంగా ఉన్నప్పుడు అతడి మొబైల్‌ ఫోన్‌లో ఫొటోలు తీసుకున్నారు.

షాకింగ్ వీడియో ఇదిగో, పట్టాలు దాటుతూ మెట్రో రైలు కింద పడి నలిగిపోయిన ప్రయాణికుడు, ఢిల్లీలోని ఛతర్‌పూర్ మెట్రో స్టేషన్‌లో విషాదకర ఘటన

ఒక రోజు ఆఫీస్‌లో ఉండగా ఆ యువతి.. తన ప్రియుడి మొబైల్‌ ఫోన్‌ తీసుకుంది. గ్యాలరీ ఓపెన్‌ చేసి అందులో ఉన్న ఫొటోలు చూసింది. అందులో తనతో పాటు అక్కడ పని చేసే ఇతర మహిళలకు చెందిన సుమారు 13,000కు పైగా అమ్మాయిల నగ్న ఫొటోలు ఉండటంతో ఒక్కసారిగా షాక్ అయింది. పనిచేసే బీపీవో సంస్థకు ఈ విషయాన్ని చెప్పింది. దీంతో ఆ సంస్థకు చెందిన లీగల్‌ విభాగం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement