Vande Bharat Hits Cow: మళ్లీ ఆవును ఢీకొట్టిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్, ప్రమాదంలో ధ్వంసం అయిన రైలు ముందుభాగం, 15 నిమిషాల పాటు నిలిపివేసిన అధికారులు
కొత్తగా ప్రారంభమైన భోపాల్-న్యూఢిల్లీ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ గురువారం సాయంత్రం మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ సమీపంలో ఆవును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో రైలు ముందుభాగం దెబ్బతింది. భోపాల్ వెళ్లే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ గ్వాలియర్‌లోని దబ్రా వద్ద ఒక్కసారిగా పట్టాలపైకి వచ్చిన ఆవును ఢీ కొట్టింది
New Delhi, April 28: కొత్తగా ప్రారంభమైన భోపాల్-న్యూఢిల్లీ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ గురువారం సాయంత్రం మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ సమీపంలో ఆవును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో రైలు ముందుభాగం దెబ్బతింది. భోపాల్ వెళ్లే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ గ్వాలియర్‌లోని దబ్రా వద్ద ఒక్కసారిగా పట్టాలపైకి వచ్చిన ఆవును ఢీ కొట్టింది.ఈ ఘటనతో రైలును 15 నిమిషాల పాటు నిలిపివేశారు.
ట్రైన్ ముందుభాగం ధ్వంసం కావడంతో అవసరమైన మరమ్మత్తులు చేపట్టిన అనంతరం రైలు ముందుకు కదిలిందని అధికారులు తెలిపారు.ఈ సెమీ హైస్పీడ్ రైలును ఏప్రిల్ 1న ప్రధాని నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించారు.గతంలోనూ పలు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆవును ఢీకొనడంతో ఆయా రైళ్లు పాక్షికంగా దెబ్బతిన్న ఉదంతాలు చోటుచేసుకున్నాయి.
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Dangerous Stunt On Moving Train: కదులుతున్న రైలు కిటికి పట్టుకుని వేలాడుతూ యువకుడి ప్రమాదకర స్టంట్.. తర్వాత ఏం జరిగింది? (వీడియో)
Hotel Roof Collapses in Tirupati: తిరుపతిలో పెను ప్రమాదం.. మినర్వా గ్రాండ్ హోటల్ లో కూలిన సీలింగ్.. భయాందోళనతో బయటకు పరుగులు తీసిన భక్తులు (వీడియో)
Youth Suicide Attempts In Medak: భూ సమస్య పరిష్కరించడం లేదని మెదక్ కలెక్టరేట్ భవనం పైకి ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం.. వైరల్ వీడియో
Advertisement
Advertisement
Advertisement