Salman Khan Meets Mamata Banerjee: బెంగాల్‌ సీఎంతో సల్మాన్ ఖాన్ భేటీ అరగంటపాటూ ఏకాంత చర్చలు, ఇద్దరి చర్చ దేనిపై అనేది సస్పెన్స్

పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీని (Mamata Banerjee) బాలీవుడ్‌ నటుడు సల్మాన్ ఖాన్‌ (Salman Khan) కలిశారు. ఈస్ట్ బెంగాల్ ఫుట్‌బాల్ క్లబ్ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొనేందుకు శనివారం ఆయన కోల్‌కతా వచ్చారు. అనంతరం కారులో సీఎం మమతా అధికార నివాసానికి వెళ్లారు. సాయంత్రం 4.25 గంటలకు మర్యాదపూర్వకంగా ఆమెను కలుసుకున్నారు.

Salman Khan Meets Mamata Banerjee (PIC@ANI Twitter)

Kolkata, May 13: పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీని (Mamata Banerjee) బాలీవుడ్‌ నటుడు సల్మాన్ ఖాన్‌ (Salman Khan) కలిశారు. ఈస్ట్ బెంగాల్ ఫుట్‌బాల్ క్లబ్ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొనేందుకు శనివారం ఆయన కోల్‌కతా వచ్చారు. అనంతరం కారులో సీఎం మమతా అధికార నివాసానికి వెళ్లారు. సాయంత్రం 4.25 గంటలకు మర్యాదపూర్వకంగా ఆమెను కలుసుకున్నారు. ఈ సందర్భంగా మమతా బెనర్జీ సల్మాన్‌ ఖాన్‌కు శాలువా కప్పారు. అనంతరం వారిద్దరూ కలిసి ప్రజలు, మీడియాకు అభివాదం చేశారు. కాగా, సల్మాన్‌ ఖాన్‌ సుమారు అర గంట పాటు సీఎం మమతా బెనర్జీ నివాసంలో ఉన్నట్లు అధికారులు తెలిపారు.

ఈ సందర్భంగా ఆయనను చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో అక్కడకు వచ్చారు. ఈ నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. అలాగే సల్మాన్‌ ఖాన్‌ బస చేసిన హోటల్‌ వద్ద కూడా భారీగా పోలీసులను మోహరించారు. మరోవైపు సీఎం మమతా బెనర్జీని నటుడు సల్మాన్‌ ఖాన్‌ కలిసిన వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Accident Averted at Hyderabad Airport: వీడియో ఇదిగో, శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో విమానానికి తప్పిన పెను ప్రమాదం, 150 మంది ప్రయాణికులు సేఫ్

CM Revanth Reddy: ఆత్మగౌరవంలోనే కాదు.. త్యాగంలోనూ పద్మశాలీలు ముందుంటారు, సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు, ఆసిఫాబాద్ మెడికల్ కాలేజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెడుతున్నట్లు ప్రకటన

Chandrababu Launches Shakti Teams: శక్తి టీమ్స్‌ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు... మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ కార్యక్రమాలకు శ్రీకారం, ప్రతీ గ్రామంలో అరకు కాఫీ ఔట్ లెట్స్‌ ఉండాలని వెల్లడి

Telangana Assembly Sessions: 12 నుండి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. 18న లేదా 19న రాష్ట్ర బడ్జెట్, ఈసారైనా అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ వచ్చేనా!

Advertisement
Advertisement
Share Now
Advertisement